Taapsee : టాలీవుడ్ కంటే బాలీవుడ్ లోనే..

టాలెంటెడ్ హీరోయిన్ తాప్సీ పన్ను.. టాలీవుడ్ తో కెరియర్ ప్రారంభించి ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 40 చిత్రాలకు పైగా నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఝుమ్మందినాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది. అనంతరం పలు తెలుగు సినిమాలలో నటించినప్పటికీ ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.

అనంతరం బాలీవుడ్ బాట పట్టిన ఈ ఢిల్లీ భామ అక్కడ మాత్రం సక్సెస్ అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక తాప్సీ సోషల్ మీడియాలోనూ తరచూ ఆక్టివ్ గా ఉంటుంది. అయితే తాప్సీ గతంలో తెలుగు ఇండస్ట్రీ గురించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదిఇలా ఉండగా తాప్సీ ఇటీవల మరోసారి తెలుగు సినీ ఇండస్ట్రీ పై పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

“నేను దేని గురించి అయినా మాట్లాడే ముందు మంచి – చెడు చూస్తా. చెప్పాల్సిన విషయం ముఖం మీదనే చెప్పేస్తా. నేను ఇలా మాట్లాడడం కొందరికి నచ్చదు. అర్థం చేసుకోకుండా నాకు పొగరు అని కామెంట్ చేస్తారు. అయినా నేను వాటిని లెక్క చేయను. నాకు మొదట సినిమాలు ఎలా ఎంచుకోవాలో తెలియలేదు. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది. టాలీవుడ్ తో పోలిస్తే బాలీవుడ్ నాకు మంచి అవకాశాలు ఇచ్చాయి”. అంటూ తాప్సీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు