Ori Devudaa: అప్పుడే ఆహాలో

తమిళంలో 2020 లో విడుదలై సూపర్ హిట్ సాధించిన ఓ మై కడవులే. ఈ చిత్రానికి రీమేక్ గా తెలుగులో వచ్చిన చిత్రం ఓరి దేవుడా. విక్టరీ వెంకటేష్ దేవుడిగా, బెస్ట్ ఫ్రెండ్ నీ పెళ్లి చేసుకుని సతమతమయ్యే అబ్బాయిగా మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటించి ఆకట్టుకున్నారు. తమిళ మూవీ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తునే తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించారు. బ్యూటిఫుల్ హీరోయిన్లు మిథిలా పాల్కర్, ఆశ బట్ నటించిన ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదలైంది. పాజిటివ్ టాక్ తో ముందుకు వెళ్తున్న ఓరి దేవుడా సినిమా రెండో రోజు బాగానే కలెక్షన్లు వసూలు చేసింది.

ఇకపోతే సినిమా థియేటర్లో విడుదలైన తర్వాత అనంతరం డిజిటల్ మీడియాలో ప్రసారమయ్యే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ మీడియా హక్కుల గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటిటి సమస్త భారీ ధరలకు కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఇకపోతే విశ్వక్ ఇదివరకే నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా హక్కులను కూడా ఆహా కైవసం చేసుకుంది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు విశ్వక్ ఆహాల ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి అయిన తర్వాత ఆహాలో ప్రసారం కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు