RRR : జపాన్‌లో అవార్డుల వేట..

అర్అర్అర్ చిత్రానికి అవార్డుల పంట పండుతుంది. పురస్కారాల వేటలో ఈ మూవీ దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులకు ఎంపికైన ఈ సినిమా ఇటీవల మరో ప్రతిష్టాత్మక అవార్డుని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ ఏం.ఏం.కీరవాణి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ఈ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డుని గెలుచుకోవడంతో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాలభైరవ, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్ లను పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉండగా, తాజాగా మరో అరుదైన అవార్డును తన ఖాతాలో వేసుకుంది.

జపాన్ 46వ అకాడమీ అవార్డ్స్ లో అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ‘ఆర్ఆర్ఆర్’ అవార్డును సొంతం చేసుకుని ప్రపంచాన్ని ఉర్రూతలుగిస్తున్న అవతార్ ద వే ఆఫ్ వాటర్, టాప్ గన్ మావేరిక్ వంటి హాలీవుడ్ చిత్రాలను దాటి, రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్అర్ సినిమా అద్భుతం సృష్టించింది. అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ‘ఆర్ఆర్అర్’ అకాడమీ అవార్డును కైవసం చేసుకుంది. జపాన్ దేశంలో ఈ చిత్రాన్ని నాలుగు లక్షల మందికి పైగా వీక్షించారు. జపాన్ లో విడుదలైన ఈ సినిమా అక్కడ బ్రహ్మాండంగా ప్రదర్శితం అవుతుంది.

- Advertisement -

For More Updates :
Grab Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment New

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు