Telugu Cinema : తెలుగు సినిమాలకు “ఓవర్” కష్టాలు

తెలుగు సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అందిరికీ తెలిసిందే. దర్శకధీరుడు జక్కన్న చెక్కిన బాహుబలి సినిమాతో తెలుగు సినిమాలకు ఆదరణ పెరిగిందని చెప్పవచ్చు. అమెరికాలో కూడా తెలుగు దర్శకుల సినిమాలపై నమ్మకం పెరిగింది. కానీ గత కొద్ది రోజుల నుండి సీన్ మారింది. ఓవర్సీస్ లో తెలుగు సినిమా కష్టాలను ఎదుర్కొంటుంది.

అమెరికాలో తెలుగు సినిమాలు కనీసం బ్రేక్ ఈవెన్ లను కూడా అందుకోవడం లేదు. దీంతో డిస్ట్రిబ్యూటర్‌లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ మధ్య కాలంలో కేవలం మూడు సినిమాలు మాత్రమే బ్రేక్ ఈవెన్ రాబట్టాయి. అందులో ఒక ఆర్ఆర్ఆర్ మాత్రమే డిస్ట్రిబ్యూటర్‌లకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది.

దీనికి కారణం.. గతంలో వచ్చిన సినిమాల తరహాలో ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలు లేక పోవడమనే చెప్పవచ్చు. ఇటీవల వచ్చిన సినిమాలు, తెలుగు రాష్ట్రాల్లోనే పెద్దగా ఆడటం లేదు. భారీ అంచనాలతో రిలీజైన ప్రభాస్ రాధేశ్యామ్, మెగాస్టార్ ఆచార్య, రవితేజ ఖిలాడి సినిమాలు ప్రేక్షకులను నిరాశపర్చాయి. మరి కొన్ని సినిమాలు కూడా అశించిన స్థాయిలో ఆడలేకపోయాయి.

- Advertisement -

దీంతో యూఎస్ డిస్ట్రిబ్యూటర్‌లకు నష్టాలు తప్పడం లేదు. దీనికి తోడు అమెరికాలో టికెట్ ధరల సమస్య కూడా డిస్ట్రిబ్యూటర్లకు బ్రేక్ ఈవెన్ రాకుండా అడ్డుపడుతుందని ఓవర్సీస్ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే, ఓవర్సీస్ లో తెలుగు సినిమాలు ఆడటమే కష్టంగా మారే అవకాశముందని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు