Pathaan :1000 కోట్ల క్లబ్ కి చేరువగా

తన నటనతో ప్రపంచం అంతా ఫ్యాన్ బేస్ క్రియట్ చేసుకున్న షా రుఖ్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ బాద్‍షాగా పేరు తెచ్చుకున్న షా రుఖ్ గత 4 ఏళ్లుగా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇక ఇప్పుడు ఒక సాలిడ్ కం బ్యాక్ సినిమా తో అసలు కామేబ్యాక్ అంటే ఇలా ఉండాలి అని చూపిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

షా రుఖ్ ఖాన్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పాడుకొనే నటించగా, జాన్ అబ్రహం ప్రతినాయకుడి పాత్రలో నటించిన యాక్షన్ సినిమా ”పఠాన్”. ఈ సినిమా పై ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పటినుంచే అంచనాలు భారీ స్థాయి లో ఉన్నాయి.

యాష్ రాజ్ ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ సినిమా భారీ కాలేకేషన్లతో రికార్డులు తిరగరాస్తుంది. తాజా గా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 667 కోట్ల కల్లెకేషన్లు సంపాదించింది. కేవలం ఇండియాలోనే 417 కోట్ల గ్రాస్ ను, 350కోట్ల షేర్ ను వసూల్ చేసింది. ఇక పఠాన్ ఓవర్సీస్ లో 250 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

- Advertisement -

పఠాన్ క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది కానీ ఎక్కడ తగ్గడంలేదు. ఇక ఇది ఇలాగె కొనసాగితే, త్వరలోనే 1000కోట్ల మార్క్ ను చేరుకొనే అవకాశాలు కూడా ఎక్కువే ఉన్నాయి. ఇంకా ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృస్టించనుందో వేచి చూడాలి.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు