Pathaan: కలెక్షన్ల సునామీ..

షారుక్ ఖాన్ .. ప్రపంచమంతటా పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. తన నటనతో బాలీవుడ్ బాద్‍షా గా పేరు తెచ్చుకున్నారు. షారుక్ కెరీర్ లో చాలా సినిమాలు అల్ టైం హిట్స్ అందుకున్నాయి. కానీ కొంత కాలంగా షారుక్ కి మంచి హిట్ రావడం లేదు. వరుస ఫ్లాప్ లతో సమస్యలు ఎదురుకుంటున్నారు. ఫ్యాన్స్ నుంచి ఎన్నో విమర్శలు వినిపించాయి. కానీ పఠాన్ సినిమాతో ఆ విమర్శలే ప్రశంశలుగా మారాయి.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ మంచి విజయాన్ని అందుకుంది. షారుఖ్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె నటించారు. యాష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయగా, స్పై యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా వచ్చింది.

కాగా ఈ సినిమాకి ముందు షారుక్ దాదాపు నాలుగేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. మధ్యలో కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్ గా కనిపించినా, పూర్తి స్థాయి హీరోగా చేయలేదు. అయితే నాలుగు సంవత్సరాల్లో షారుక్ ఫ్యాన్స్ మిస్ అయిన దాన్ని ఈ పఠాన్ సినిమాతో ఇచ్చేశాడు. ఈ చిత్రం భారీ కలెక్షన్స్ ను సంపాదించుకుంటూ రికార్డులను తిరగరాస్తుంది.

- Advertisement -

సినిమా రిలీజ్ అయిన ఒక వారంలోనే ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్ల మార్క్ ను దాటేసింది. కేవలం ఇండియాలోనే 395 కోట్ల గ్రాస్ ను, 330.25 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. ఒక ఓవర్సీస్ లో పఠాన్ విద్వంసం సృష్టిస్తోంది. ఈ వారం రోజుల్లో పఠాన్ ఓవర్సీస్ లో 239 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

పఠాన్ హవా ఇలాగే సాగితే, అతి త్వరలోనే 1000 కోట్ల క్లబ్ లో కూడా చేరే అవకాశం లేక పోలేదు. ఇక ముందు పఠాన్ సినిమా ఎన్ని రికార్డులను బ్రేక్ చేయనుందో చూడాలి మరి.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు