Pathaan : బాయ్ కాట్ ట్రెండ్ తట్టుకుంటుందా?

బాలీవుడ్‌లో గ‌త కొంత కాలంగా బాయ్‌కాట్ ట్రెండ్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ధానంగా లాల్ సింగ్ చద్దా సినిమా నుంచి ఎక్కువ‌గా బాయ్ కాట్ ట్రెండ్ కొన‌సాగింది. ఆ త‌రువాత బ్ర‌హ్మాస్త్ర సినిమాకి కూడా ఇదే ట్రెండ్ కొన‌సాగింది. బాయ్ ట్రెండ్ కొన‌సాగిన సినిమాలు ఏవీ కూడా బాక్సాఫీస్ వ‌ద్ద నిల‌వ‌లేదు. అన్ని సినిమాలు కూడా ఆశించిన ఫ‌లితాలు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు ఎక్కువ‌గా బాయ్‌కాట్ సెగ త‌గులుతుంది.

బాలీవుడ్ నుంచి వ‌చ్చే భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్స్‌, ట్రైల‌ర్స్‌, సాంగ్స్ ఇలా ఒక్కో సినిమాకి ఒక్కో అంశంపై నెగిటివ్ చేస్తూ నెటిజ‌న్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్ప‌టికే అమిర్‌ఖాన్ లాల్ సింగ్ చ‌ద్దా, అక్ష‌య్ కుమార్ ర‌క్షాబంధ‌న్‌, హృతిక్ రోష‌న్ విక్ర‌మ్ వేద‌, సినిమాలు బాయ్‌కాట్ సెగ‌తో బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచాయి. భారీ అంచ‌నాల‌తో భారీ బ‌డ్జెట్‌తో సినిమాల‌ను తెర‌కెక్కించిన సినిమాల‌ను ప్రేక్ష‌కులు సైతం ఆద‌రించ‌డం లేదు. ప్ర‌స్తుతం ఈ బాయ్‌కాట్ ట్రెండ్ షారూఖ్ ఖాన్ చిత్రానికి కూడా త‌గులుతుంది.

న‌వంబ‌ర్ 02న షారూఖ్ ఖాన్ పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌లైన ప‌ఠాన్‌ టీజ‌ర్‌కి విశేష స్పంద‌న ల‌భించింది. చాలా కాలం త‌రువాత షారూఖ్ ఈ సినిమాతో స్క్రీన్‌పై సంద‌డి చేయ‌నున్నారు. మంచి స్పంద‌న‌తో దూసుకుపోతున్న ఈ టీజ‌ర్‌కు ఇప్పుడు బాయ్‌కాట్ వివాదం అడ్డుప‌డుతుంది. ఈ సినిమాని బ‌హిష్క‌రించాల‌ని డిమాండ్ వినిపిస్తోంది. షారూఖ్‌ఖాన్ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలంటూ సోష‌ల్ మీడియాలో ట్వీట్స్ వైర‌ల్ అవుతున్నాయి. కేవ‌లం ప‌ఠాన్ చిత్ర‌మే కాకుండా బాద్ షా గ‌తంలో న‌టించిన సినిమాల‌కు సంబంధించి క్లిప్స్ కూడా షేర్ చేస్తూ బాయ్‌కాట్ ప‌ఠాన్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. మ‌రి ప‌ఠాన్ సినిమా బాయ్‌కాట్ ట్రెండ్ ని త‌ట్టుకొని నిల‌బ‌డుతుందా లేదా అనేది వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు