Pawan Kalyan: పవన్ కెరియర్ లో ఫస్ట్ టైం

పదేళ్లు హిట్ సినిమా లేని తరుణంలో పవన్ కెరియర్ లో పడిన బ్లాక్ బస్టర్ సినిమా గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ అభిమానులకి అది ఫుల్ మీల్.
BHEL లో తొలిప్రేమ, తమ్ముడు షూటింగ్ జరుగుతుంటే ఎగిరెగిరి చూసిన ఒక కాలేజీ కుర్రాడు, పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలని కలని కన్నాడు. ఆ కలను సాకారం చేసుకోవడానికి కష్టాలను దాటాడు.
ఆ కలను నిజం చేసుకుని ఒక బ్లాక్ బస్టర్ సినిమాను తీసాడు.

ఆకలితో వచ్చేవాళ్ళు భుక్తాయాసంతో ఈ సినిమా నుండి బయటకు వెళ్తారు అని మాట ఇచ్చాడు, ఆ మాటను నిలబెట్టుకున్నాడు.
ఆయనతో పని చేసినా ఇంకా ఆ దర్శకుడి ఆకలి తీరలేదు.
అందుకే మరోసారి “భవదీయుడు భగత్ సింగ్” సినిమాతో మరోసారి ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్ గా కనిపిస్తారు అని రీసెంట్ గా కన్ఫర్మ్ చేసాడు హరీష్.
పవన్ కెరియర్ లో ఈ కేరక్టర్ ను చేయడం ఫస్ట్ టైం.
ఇదివరకే మిరపకాయ్ సినిమాలో రవితేజ ను లెక్చరర్ గా చూపించిన హరీష్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ను ఎలా చూపించబోతున్నారో..

త్రివిక్రమ్ శ్రీనివాస్ మినహాయిస్తే పవన్ కళ్యణ్ తో రెండోసారి చేసిన ప్రతి దర్శకుడు ఫెయిల్ అయ్యాడు,
“”తొలిప్రేమ” లాంటి హిట్ తీసిన కరుణాకర్ బాలు,
“సుస్వాగతం” సినిమా చేసిన భీమినేని శ్రీనివాసరావు “అన్నవరం”
“బద్రి” హిట్ తీసిన పూరి “కెమరామెన్ గంగతో రాంబాబు”
“ఖుషి” తీసిన ఎస్.జె.సూర్య “పులి”
ఇప్పుడు హరీష్ ఏమి చేస్తాడో తెలియాలి అంటే రిలీజైనంతవరకు వెయిట్ చెయ్యాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు