Pawan Kalyan: 2 దశాబ్దాలు తరువాత

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈయన కున్న క్రేజ్ గురించి, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇండస్ట్రీ కి పరిచయం అవ్వకముందునుంచే కరాటే నేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్. అందరూ డాన్స్ లు, యాక్టింగ్ చేసి ఫ్యాన్ ఫాలోయింగ్ సాధిస్తే, కళ్యాణ్ డిఫరెంట్ గా తన ఆటిట్యూడ్, స్టైలిష్ ఫైటింగ్ తో సినిమాల్లో కొన్ని ఒరిజినల్ స్టంట్స్ చేస్తూ ఒక క్రేజి హీరో అనిపించుకున్నాడు కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ ఒక మల్టి టాలెంటెడ్ హీరో. సింగర్, రైటర్ , డైరెక్టర్ గా ఇదివరకే పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేసుకున్నారు. అయితే కిక్ బాక్సింగ్, కరాటే సహా ఇతర మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్న కళ్యాణ్ “జానీ” తర్వాత ఇప్పటివరకు ఏ సినిమాలోనూ మార్షల్ ఆర్ట్స్ ను పూర్తి స్థాయిలో చూపించలేదు.ఇప్పుడు తన భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కి పవన్ మార్షల్ ఆర్ట్స్ స్టార్ట్ చేయడం విశేషం. నిన్న పవన్ కూడా ఓ స్టన్నింగ్ స్టిల్ పెట్టి “After two decades I got into my Martial Arts practice” అని పోస్ట్ చేయడంతో సోషల్ మీడియా హల్చల్ మొదలైంది.

దీనిపై దర్శకుడు క్రిష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. “పవన్ కళ్యాణ్ గారు మీ మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ ని దగ్గరుండి హరిహర వీరమల్లు సెట్స్ నుంచి చూడడాన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నానని అలాగే ఈ చిత్రం పట్ల మీ డెడికేషన్ ప్రపంచం అంతా ఎప్పుడు చూస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని” తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు