Pawan Kalyan: దర్శకులకు స్ట్రిక్ట్ కండిషన్స్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా డిఫరెంట్ సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాతో పాటు వినోదయ సీతం రెండు సినిమాలు కూడా సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. ఇక వీటితో పాటు యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో కూడా OG అనే ప్రాజెక్టును త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు.

ఇక హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే ఎక్కువగా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా పైన అంచనాలు పెట్టుకున్నారు. మొదట వీరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకున్న ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్, ఎప్పుడు రాజకీయాలు అంటూ వెళ్ళిపోతాడో అర్థం కాక దర్శకులు తలలు పట్టుకుని కూర్చున్నారట. తమ సినిమాలు పూర్తి చేస్తాడా లేదా అనే గందరగోళంలో ఉన్నారని సమాచారం. కాకపోతే పవన్ కళ్యాణ్ వాళ్ళందరికీ కచ్చితంగా న్యాయం చేయాలని చూస్తున్నాడు. అందుకే తనతో సినిమాలకు కమిట్ అయిన దర్శకులు అందరికీ పవన్ ఒకే కండిషన్ పెట్టారట. నెల రోజులు మాత్రమే డేట్స్ ఇస్తానని కండిషన్ పెట్టాడట.

- Advertisement -

ఎలాంటి సినిమా అయినా, ఎంత పెద్ద కథ అయినా తనతో సినిమా చేయాలంటే కేవలం 30 రోజుల్లో మాత్రమే పూర్తి చేయాలని కండిషన్ పెడుతున్నాడు. పవన్ కళ్యాణ్ సముద్రఖని లాంటి దర్శకులకు అయితే కేవలం 20 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చాడు. అందులోనే తన పార్ట్ పూర్తి చేసి మిగిలిన సినిమాలు మెల్లగా చేసుకోవాలంటూ దర్శక నిర్మాతలకు చెప్తున్నాడు. పవర్ స్టార్ అన్నట్లుగానే ఒకేసారి నాలుగు సినిమాలకు డేట్స్ ఇచ్చేశాడు పవన్ కళ్యాణ్.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు