Pawan Kalyan: పవన్ తో సినిమా చేయాలంటే త్రివిక్రమ్ అడ్డు

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. యంగ్ డైరెక్టర్స్ తో తన సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. అలానే సుదీర్ వర్మ దర్శకత్వంలో కూడా పవన్ సినిమా చేయనున్నాడని ఆ మధ్య కథనాలు వినిపించాయి.

సుధీర్ వర్మ తన మొదటి సినిమా స్వామి రారా తో దర్శకుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. టెక్నికల్గా ఆ సినిమాని కొత్తగా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలను పొందాడు కేవలం విమర్శలే కాకుండా ఆ సినిమా కమర్షియల్ గా కూడా మంచి హిట్ అయింది. ఆ సినిమా తర్వాత చేసిన దోచేయ్ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు ఆ తర్వాత చేసిన కేశవ సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది బట్ సుదీర్ వర్మ టెక్నికల్ గా ఒక సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తాడని చాలామందికి తెలుసు.

స్వామి రారా సినిమా తర్వాత హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాత రాధాకృష్ణ మొదటిసారి తనకు సినిమా చేయమని అడ్వాన్స్ ఇచ్చారు. దానికి అనుసంధాన బ్యానర్ అయినా సితార ఎంటర్టైన్మెంట్స్ లో రణరంగం సినిమాని తెరకెక్కించాడు సుధీర్ వర్మ. కానీ ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు ప్రస్తుతం సుధీర్ వర్మ రవితేజ తో రావణాసుర సినిమాను తెరకెక్కించాడు.

- Advertisement -

ఈ సినిమా తర్వాత సుదీర్ వర్మ పవన్ కళ్యాణ్ తో చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై రావణాసుర సినిమా ప్రమోషన్స్లో సుధీర్ వర్మ ఒక క్లారిటీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడు ఉండబోతుందని తనకు క్లారిటీగా తెలియదని ఒక ఆలోచన మాత్రం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనతో షేర్ చేశారని ఆ స్టోరీ లైన్ ని డెవలప్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఉండబోతుందని సుధీర్ వర్మ క్లారిటీ ఇచ్చాడు.

మొత్తానికి యంగ్ డైరెక్టర్స్ అందరికి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ ఒక వారధిగా ఉపయోగపడుతున్నాడని చెప్పొచ్చు కానీ కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి త్రివిక్రమే అడ్డుపడుతున్నాడని వాపోతున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు