HHVM: నిర్మాతను నిండా ముంచేస్తున్న పవన్…?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. తమ అభిమాన హీరోను తొలిసారి పీరియాడిక్ పాత్రలో చూడాలని గత రెండేళ్లుగా చూస్తున్నారు. 2019లోనే ఈ సినిమాపై చర్చలు ప్రారంభం అయ్యాయి. 2020లో హరిహర వీరమల్లును మెగా సూర్య ప్రొడక్షన్ అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంటుంది. దీని కోసం వేసిన షూటింగ్ సెట్స్ కూలిపోతున్నా.. సినిమా మాత్రం పూర్తి కాలేకపోతుంది.

ఇటీవల పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లును స్టార్ట్ చేశాడు. శరవేగంగా షూటింగ్ కూడా జరిగింది. తాజాగా మళ్లీ ఇప్పుడు బ్రేకులు పడ్డాయి. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. ఈ సినిమాని రెండు పార్టులుగా తీయాలని నిర్ణయం తీసుకున్నారట. స్టోరీ పెద్దదిగా ఉండటంతో ఒకే పార్ట్ గా తీసుకురావడం కష్టంగా మారిదంని తెలుస్తోంది. దీనికే దాదాపు 150 కోట్ల వరకు బడ్జెట్ అయింది. మళ్లీ సెకండ్ పార్ట్ అంటే.. మరో 100 కోట్లకు పైగే ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది.

ఇప్పటి వరకు అయిన షూటింగ్ లో పెద్దగా యాక్షన్ ఎపిసోడ్స్ ఏమీ కూడా లేవట. ఈ విషయాన్ని అన్ స్టాపబుల్ షోలో స్వయంగా పవన్ కళ్యాణ్, క్రిష్ వెల్లడించారు. సినిమాకు హైలైట్ గా ఉండే యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కూడా సెకండ్ పార్ట్ లో వచ్చే సూచనలు ఉన్నాయట. సినిమాలో విలన్ పాత్ర చేస్తున్న బాబి డియోల్ షూట్ ఇంకా స్టార్టే కాలేదట. ఆయనపై కేవలం ఒక చిన్న షాట్ ను షూట్ చేశారట. ఆయన పాత్ర మొత్తం సెకండ్ పార్ట్ లోనే రాబోతుందని టాక్.

- Advertisement -

అంటే సినిమా మొత్తం సెకండ్ పార్ట్ లోనే ఉంటుంది. దీంతో ఫస్ట్ పార్ట్ లో ఏం ఉంటుంది? ఈ డౌట్ రాకమానదు. నిజానికి ఫస్ట్ పార్ట్ పరిచయాలకు మాత్రమే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ప్రేక్షకులను మెప్పించే సీన్స్, హీరోపై ఎలివేషన్స్ షాట్స్, హై ఇచ్చే యాక్షన్ సన్నివేశాలు ఫస్ట్ పార్ట్ లో ఉండవని సమాచారం. మొత్తంగా 150 కోట్లతో వస్తున్న ఫస్ట్ పార్ట్ డల్ గా ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీని వల్ల నిర్మాతకు భారీ స్థాయిలో నష్టాలు రావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.

కాగా ఏఎం రత్నం, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఖుషి, బంగారం సినిమాలు వచ్చాయి. ఖుషి మంచి హిట్ కాగా, బంగారం సినిమా పెద్ద డిజాస్టార్ గా మిగిలింది. 16 ఏళ్ల తర్వాత ఈ కాంబో మళ్లీ కలిసి పని చేస్తున్నాయి. మరి ఈ హ్యాట్రీక్ మూవీ వీరికి ఎలాంటి అనుభవాన్ని ఇస్తుందో వేచి చూడాలి.

For More Updates : 

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు