Ustaad Bhagat Singh: ఇక మొదలు…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు వీరి కాంబో లో ఇంకో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ పవర్ స్టార్ కాంబోలో వచ్చే మూవీకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. దీన్ని డిసెంబర్ 11 న అధికారికంగా ప్రకటించారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న ‘హరి హర వీర మల్లు’ కు బ్రేక్ ఇచ్చారు. దీని తర్వాత పవర్ స్టార్ మరో మూడు సినిమాలకు సైన్ చేశాడు. అందులో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ కాగా.. వినోదయ సీతం రీమేక్, సుజిత్ దర్శకత్వంలో OG. వరుసగా సినిమాలను లైనప్ చేసుకున్న పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో వినోదయ సీతం రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

ఈ సినిమాకు పవన్ కళ్యాణ్.. ఈ నెల 25 వరకు డేట్స్ ఇచ్చాడు. దీని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం. తాజాగా ట్విట్టర్ వేదికగా ఈ మూవీ గురించి ట్వీట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలవుతుందని, గ్రాండ్ సెట్ నిర్మిస్తున్నారని అనౌన్స్ చేశారు. అలాగే సెట్స్ కి సంబంధించిన రెండు ఫోటోలు కూడా షేర్ చేసారు. ఈ ట్వీట్ చూసినప్పటి నుండి ఫ్యాన్స్ అందరూ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు