Vijay Antony : నేను క్షేమంగానే ఉన్నాను..

విజయ్ ఆంటోనీ, తమిళ మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి, తర్వాత హీరోగా మారి అనేక సినిమాల్లో నటించాడు. బిచ్చగాడు సినిమాతో ఆయనకు మరింత గుర్తింపు వచ్చింది. కాగా ఇటీవల బిచ్చగాడు2 సినిమా షూటింగ్ సమయంలో విజయ్ ఆంటోనీకి ఆక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. మలేషియాలో ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఆయన ఒక బోట్ చేజింగ్ సీక్వెన్స్ లో పాల్గొంటున్న సమయంలో బోట్ అదుపుతప్పి కెమెరా టీం ఉన్న మరో బోట్ ని ఢీకొట్టింది. దీంతో విజయ్ ఆంటోనికి తీవ్ర గాయాలు అయ్యాయి.

చిత్ర యూనిట్ వెంటనే విజయ్ ని హాస్పిటల్ కి తరలించారు. అప్పటి నుంచే ఆయన కోమాలో ఉన్నారని, ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషయమంగా ఉందని ప్రచారం జరిగింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు మలేషియా వెళ్లి, చెన్నైకి తీసుకువచ్చారు. అయితే తాజాగా తన ఆరోగ్యం గురించి స్వయంగా విజయ్ ఆంటోని క్లారిటీ ఇచ్చారు. తాను క్షేమంగా ఉన్నానని, త్వరలోనే అందరితో మాట్లాడతానని విజయ్ ఆంటోనీ చెప్పుకొచ్చారు.

తన ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించిన వారికి కృతజ్ఞతలు చెబుతూ విజయ్ ఒక ట్వీట్ చేశారు. ట్వీట్‌తో పాటు తాను బాగానే ఉన్నాని చెబుతూ థమ్సప్ చూపిస్తున్న ఫోటో షేర్ చేశారు. అలాగే తనకు దవడ, ముక్కు భాగాలలో తీవ్ర గాయాల అయ్యాయని, దానికి సంబంధించిన సర్జరీ కూడా పూర్తయిందని ట్వీట్ లో ఆయన తెలిపాడు.

- Advertisement -

హీరో విజయ్ నుంచే స్వయంగా ట్వీట్ రావడంతో ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. అలాగే ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది అని వస్తున్న వార్తలకు కూడా బ్రేక్ పడింది.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు