BRO: ట్రెండ్ సెట్ చేస్తున్న మామ అల్లుళ్ళు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలయిక లో వస్తున్న సినిమా “BRO”. సముద్ర ఖని తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో సినిమా పై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు. ముఖ్యంగా ఆ మోషన్ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ను ఎలివేట్ చేస్తూ వచ్చే శ్లోకంతో కూడిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఉంది.

సినిమా షూటింగ్ మొత్తం ఇప్పటికే పూర్తయిపోగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ నుంచి ప్రమోషన్లు షురూ చేసేసారు. ముందుగా బ్రో టైటిల్ అనౌన్స్ మెంట్ తో రచ్చ చేయగా, వెంట వెంటనే పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ లుక్స్ లను వదులుతూ హైప్ పెంచేశారు. తాజాగా వాళ్లిద్దరూ కలిసి ఉన్న స్టిల్ ని వదిలారు. ఇందులో సాయి ధరమ్ తేజ్ గ్రీన్ టీషర్ట్, వైట్ షర్ట్ తో సింపుల్ గా ఉండగా, పవన్ కళ్యాణ్ స్టిల్ మాత్రం ఓ రేంజ్ లో ఎలివేట్ అయింది. పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్న బైక్ పై కాలుపెట్టి చూస్తున్న లుక్ బాగా ఎలివేట్ అయింది. అయితే ఫ్యాన్స్ అందర్నీ ఆకర్షిస్తున్న విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ వేసుకున్న షూస్ చాలా కొత్తగా ఉన్నాయి.

PK is creating a trend again
PK is creating a trend again

 

- Advertisement -

బ్లాక్&వైట్ కలర్ లో ఉన్న ఆ షూస్ కు లేస్ కిందినుంచి ఉండడం విశేషం. కాగా ఎంతో ట్రెండీగా ఉన్న ఈ షూస్ ఖరీదు 1238 డాలర్లు. అనగా అక్షరాలా ఒక లక్షా పదివేల రూపాయలు. ఇంతకు ముందు విడుదలైన బ్రో ఫస్ట్ లుక్ లో కూడా పవన్ కళ్యాణ్ షూస్ చాలా పెద్దగా వెరైటిగా ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఖుషి, జల్సా సినిమాల్లో పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్ తో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇప్పుడు మళ్ళీ మొదలవుతుండడం విశేషం. దీంతో pk మళ్ళీ ట్రెండ్ సెట్ చేస్తున్నాడని ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు. ఇక బ్రో సినిమా జులై 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment New

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు