PKSDT: పవన్ కొత్త సినిమా లీక్స్.. దేవుడు అదిరిపోయాడు కదా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమాలను సమానంగా బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఇటీవలే తన పార్టీ తొమ్మిదేళ్లను పూర్తి చేసుకుని పదో సంవత్సరంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి పవన్ అదే బిజీలో ఉన్నాడు. అలాగే ఇటు సినిమాల పరంగా కూడా పవర్ స్టార్ చాలా బిజీగా ఉన్నాడు. ఆయన ప్రస్తుతం హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, PKSDT, OG సినిమాలు చేస్తున్నాడు. ఇందులో హరి హర వీరమల్లు షూటింగ్ ప్రస్తుతం బ్రేక్ ఇచ్చాడు.

ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో సముధ్ర ఖని దర్శకత్వంలో వినోదయ సీతం తెలుగు రీమేక్ PKSDT చేస్తున్నాడు. అందుకోసం పవన్ 22 రోజుల డేట్స్ కూడా ఇచ్చాడు. అయితే ఈ సినిమా ప్రస్తుతం కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో పవర్ స్టార్ ఆల్ట్రా స్టైలీష్ లుక్ లో కనిపిస్తున్నాడు. వైట్ పాయింట్ తో పాటు వైట్ షర్ట్ వేసిన పవన్ లుక్ ఆకట్టుకుంటుంది. అలాగే బ్లాక్ కళ్లజోడు.. పవర్ స్టార్ ఏజ్ ను మరింత తగ్గిస్తుంది.

ఈ ఫోటోలో ముందు పవన్ కళ్యాణ్ వెనకాల మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఉన్నాడు. దీన్ని చూస్తూంటే.. సినిమాలో ఓ ఫైట్ సీన్ సమయంలోని ఫోటో అని తెలుస్తోంది. కాగా PKSDTలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో బ్రహ్మానందం కూడా నటిస్తున్నాడు. ఆయనతో పాటు కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, రోహిణి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి కూడా ఉన్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు