Surya : హీరో సూర్య, జ్యోతిక ల పై కేసు నమోదు..!

సూర్య లాయర్ పాత్రలో నటించిన ‘జై భీమ్’ చిత్రం ఓటిటి వేదికగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలయ్యి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం వన్నియర్ సామాజిక వర్గాన్ని విమర్శించే విధంగా తెరకెక్కిందని సూర్య, జ్యోతిక,దర్శకుడు జ్ఞానవేల్ పై కేసు నమోదు చేయాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో రుద్ర వన్నియర్ సేన వ్యవస్థాపకుడు సంతోష్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

 

అయితే పోలీసులు ‘జై భీమ్’ టీం పై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. దీంతో సంతోష్ సైదాపేట మేజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.ఇటీవల కోర్టులో ఈ విషయం పై విచారణ జరిగ్గా…. హీరో సూర్య, నిర్మాత జ్యోతిక దర్శకుడు టీజే జ్ఞానవేల్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కోర్డుకు సమర్పించాలంటూ స్థానిక పోలీసులకు న్యాయస్థానం ఆదేశించింది.

- Advertisement -

 

దాంతో పోలీసులు హీరో సూర్య, జ్యోతికతో పాటు దర్శకుడు జ్ఞానవేల్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అంతేకాదు వన్నియర్ సంఘం సూర్య మరియు జై భీమ్ టీం పై రూ.5 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేయడం కూడా జరిగింది. ఈ విషయంలో ‘జైభీమ్’ భహిరంగంగా క్షమాపణలు కోరితే.. పరువు నష్టం ఉపసంహరించుకుంటామని వన్నియర్ సంఘం వెల్లడించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు