Pooja Hegde: గ్రహాలు సహకరించడం లేదా.?

హీరోయిన్ పూజ హెగ్డే గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ గడిచిన కొద్ది కాలంలోనే అనేకమంది టాప్ హీరోస్ తో నటించి సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది. అయితే గత ఏడాది మాత్రం ఈ హీరోయిన్ కెరియర్ అంత గొప్పగా సాగలేదని చెప్పాలి. అవకాశాలు ఎన్నో వచ్చిన,‌ వచ్చిన ప్రతి అవకాశం డిజాస్టర్ గా మిగిలింది.

బీస్ట్, ఆచార్య, మరియు రాదే శ్యామ్ లాంటి వరస ఘోర పరాజయాలను చవిచూసింది పూజా హెగ్డే. ఆఖరికి హిందీలో నటించిన సినిమా కూడా పూజకి ఫ్లాప్ ఏ మిగిల్చింది.

అయినా స్టార్ క్రేజ్ అయితే ఈ హీరోయిన్ కెమి ఇంకా తగ్గలేదు. అందుకే అత్యంత రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ ఎవరు అనగానే ఈ హీరోయిన్ పేరు మొదట్లోనే వినిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఒక పక్క ఫ్లాపులు మరో పక్క మాత్రం ఎక్కువ రెమ్యునరేషన్, ఈ రెండిటినీ జీర్ణించుకోలేక నిర్మాతలు ఈ హీరోయిన్ కి పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదేమో అనిపిస్తుంది. దానికి తగ్గటుగానే ప్రస్తుతం పూజ చేతిలో మహేష్ మరియు త్రివిక్రమ్ చిత్రం #SSMB28 మాత్రమే ఉంది. ఇక సర్కస్ లాంటి ఫ్లాప్ సినిమా తరువాత హిందీలో ఆమె సల్మాన్ ఖాన్‌తో జతకట్టిన చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్ విడుదలకు సిద్ధంగా ఉంది.

- Advertisement -

ఈ రెండు మినహా పూజా సినిమాలు ఏవి లైన్లో లేవు. మరి ఈ టాలెంటెడ్ మరియు హాట్ బ్యూటీ ప్రస్తుతం మరే ఇతర చిత్రానికి ఎందుకు సైన్ చేయడం లేదని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అయితే చాలామంది ఈ హీరోయిన్ రెమ్యునరేషన్ తగ్గించే వరకు తనకు అవకాశాలు తప్పకుండా రావు అని అంటున్నారు.

కానీ ఇవన్నీ పక్కన పెడితే దీనికి అసలు కారణం వేరే ఉంది అంటూ ప్రస్తుతం ఒక వార్త చెక్కర్లు కోడుతోంది,
కొత్త సినిమాలకు సైన్ చేయడానికి మే 2023 వరకు వేచి ఉండమని దర్శకుడు త్రివిక్రమ్ పూజను కోరినట్లు సమాచారం. ఆమె జ్యోతిష్యం ప్రకారం చెడు దశను ఎదుర్కొంటున్నట్లు, గ్రహాల ప్రభావం కారణంగా ఆమె జ్యోతిషశాస్త్ర చార్టులో కొన్ని గ్రహ మార్పులు జరిగిన తర్వాత మాత్రమే కొత్త సినిమాలకు సైన్ చేయమని దర్శకుడు ఆమెకు సలహా ఇచ్చినట్లు ఒక వార్త ప్రచారంలో ఉంది.

త్రివిక్రమ్ మరియు పూజ చాలా క్లోజ్ అనే వార్త ఎప్పటినుంచో సినీ వర్గాల్లో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే వీరిద్దరూ వరుస పెట్టి సినిమాలు చేశారు. ఇక త్రివిక్రమ్ కి పూజాతో ఉన్న చనువుకొద్దే, తన కెరీర్ గురించి ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని, అందువల్లనే ఈ జ్యోతిష్యం గురించి చెప్పి తనని కొద్ది రోజులు సినిమాలు ఒప్పుకోవద్దు అని తెలియజేసినట్లు తెలుస్తోంది. అయితే పూజా హెగ్డే దీన్ని సీరియస్ గా తీసుకొని దర్శకుల దగ్గర ప్రస్తుతానికి కథలు కూడా వినడం లేదట. కాబట్టి గురూజీ చెప్పిన మాటల్ని ఫాలో అవుతున్న పూజకి మరిన్ని సినిమాలు ఒప్పుకోవడానికి ఇంకొన్ని రోజులు తప్పకుండా తీసుకోవచ్చు అనడంలో సందేహం లేదు.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు