Waltair Veerayya : చిరంజీవి, రవితేజ పూనకాలు లోడింగ్

టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ, శృతిహాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, మెగా అభిమాని బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సంక్రాంతి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ పనుల్లో వేగం పెంచింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి స్టన్నింగ్ సాంగ్ అప్డేట్ వచ్చింది. వాల్తేరు వీరయ్య నుంచి మెగా మాస్ సాంగ్ పూనకాలు పాటకు సంబంధించిన అప్డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మెగా మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ పూనకాలు లోడింగ్ అంటూ ఈ పాటను డిసెంబర్ 30న లాంచ్ చేయబోతున్నట్టు స్పెషల్ పోస్టర్ ద్వారా ప్రకటించారు మేకర్స్.

చిరంజీవి, రవితేజ మాస్ బీట్ తో ఇరగదీయ్యబోతున్నట్టు తాజా పోస్టర్ చెబుతోంది. ముందుగా వచ్చిన అప్డేట్ ప్రకారం ఆర్టిసి ఎక్స్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో రేపు సాయంత్రం 6 గంటలకు ఈ పాటను లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. కాగా వాల్తేరు వీరయ్య సినిమా జనవరి మాసంలో సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు