Varasudu : ఎవరికి ప్లస్..? ఎవరికి మైనస్..?

ఎప్పుడు లేని విధంగా ఆసక్తిగా ఈ సారి సంక్రాంతి పోరు ఉంది. టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలయ్య ఇద్దరు పోటీలో ఉండటంతో సంక్రాంతి పోరుపై రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. ఈ అగ్ర హీరోలు సంక్రాంతి బరిలో ఇప్పటి వరకు చాలా సార్లు నిలిచారు. కానీ, ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఇంత ఇంట్రెస్ట్ కనిపించలేదు. వీరితో పాటు కోలీవుడ్ స్టార్లు అజిత్, విజయ్ కూడా ఈ సారి సంక్రాంతి రేస్ లో ఉంటున్నారు.

వీరికి తెలుగు మార్కెట్ లో మంచి పట్టు ఉంది. ఈ స్టార్లు నటించిన తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయి.. టాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెప్పించాయి. దీంతో వీరి సినిమాలను తక్కువ అంచనా వేయలేం. పైగా ప్రస్తుతం ప్రేక్షకులు.. భాషలతో సంబంధం లేకుండా.. మంచి కంటెంట్ ఉన్న సినిమాలనే ఆదరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో సంక్రాంతి పోరు ఉంది. కాబట్టి చిరు, బాలయ్య సినిమాలపై తీవ్రమైన ఒత్తిడి ఉందని చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా విజయ్ వారీసు తెలుగులో వస్తున్న వారసుడు వాయిదా పడిన విషయం తెలిసిందే. ముందుగా ఈ సినిమాను జనవరి 11న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ తెలుగు సినిమా పరిశ్రమ పెద్దల సూచనల మేరకు వారసుడు ను వాయిదా వేస్తున్నట్టు నిర్మాత దిల్ రాజు ఈ రోజు ప్రకటించాడు. జనవరి 14న తెలుగు వర్షెన్ రిలీజ్ చేస్తామని వెల్లడించాడు.

- Advertisement -

అయితే వారసుడు వాయిదా వల్ల ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ? అని పరిశీలిస్తే.. ఎక్కువగా కలిసొచ్చేది బాలయ్య వీర సింహా రెడ్డికి అని చెప్పొచ్చు. ఎందుకంటే.. 11న అజిత్ తెగింపు రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రభావం తెలుగు ప్రేక్షకులపై ఉన్నా.. మరీ బాలయ్య సినిమాకు ఎఫెక్ట్ చేసేంత ఉండదు. దీంతో 12న వస్తున్న వీర సింహా రెడ్డికి పెద్దగా పోటీ ఉండదు. దీని వల్ల వీర సింహా రెడ్డికి మొదటి రోజు భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది.

అలాగే కొంత వరకు మెగాస్టార్ చిరంజీవికి ఉండొచ్చు. వాల్తేరు వీరయ్య కు కూడా మొదటి రోజు కొంత వరకు కలెక్షన్లు ఎక్కువగా రావొచ్చు. అయితే వారసుడు వాయిదా పడటం వల్ల ఈ అగ్ర హీరోల సినిమాలకు కేవలం మొదటి రోజు కలెక్షన్లపైనే ప్రభావం ఉంటుంది. తర్వాత రోజుల కలెక్షన్లు మాత్రం సినిమా టాక్ ను బట్టే ఉంటుందని చెప్పొచ్చు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు