Prabhas: కృతి సనన్ తో ఎంగేజ్‌మెంట్ పై క్లారిటీ

హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ ఉన్నట్టు రూమర్స్ రావడం ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోయింది. ఒక సినిమాలో కలిసి పని చేస్తున్న హీరో, హీరోయిన్లు ప్రేమలో పడిపోయారని, రిలేషన్ షిప్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ తెగ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి రూమర్స్ పై హీరో, హీరోయిన్లు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చినా, అవి తగ్గడం లేదు.

ప్రస్తుత కాలంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ గురించి ఎక్కువ న్యూస్ వస్తోంది. ఈ ఇద్దరు ఆది పురుష్ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ క్రమంలో కృతి ప్రేమలో ప్రభాస్ పడిపోయాడని రూమర్స్ వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ప్రభాస్, కృతి సనన్ స్పందించారు. ఈ రూమర్స్ ను ఖండించారు. తమ మధ్య ప్రేమ ఉంది అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చాలా సార్లు చెప్పారు. అయినా, ఈ వార్తలకు బ్రేకులు పడటం లేదు.

ఇటీవల ఈ జంట గురించి ఓ వార్త తెగ చక్కర్లు కొట్టింది. ప్రభాస్, కృతి సనన్ పెళ్లికి రెడీ అయ్యారని, త్వరలోనే మాల్దీవుల్లో ఎంగేజ్ మెంట్ చుసుకోబోతున్నారు అంటూ ఒక వార్త వైరల్ అయింది. అయితే ఈ న్యూస్ తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టీం స్పందించింది. ఎంగేజ్ మెంట్ వార్తలను కొట్టిపడేసింది. “ప్రభాస్, కృతి సనన్ చాలా రోజుల నుంచి మంచి ఫ్రెండ్స్. వారి మధ్య లవ్ ఉంది అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. అలాగే మాల్దీవుల్లో వారి ఎంగేజ్ మెంట్ అవుతుంది అంటూ వస్తున్న వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదు” అంటూ ప్రభాస్ టీం ప్రకటించింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు