Prashanth Neel: ప్రశాంత్ నీల్ ఇంకెంత కాలం.?

ప్రశాంత్ నీల్ కెజిఫ్ ముందు వరకు ఈ పేరు చాలామందికి తెలియదు. కెజిఫ్ సినిమా తరువాత ఈ పేరు తెలియని వారు లేరు. ఒక సక్సెస్ కి ఉండే వాల్యూ ఏంటో మనం ఇండస్ట్రీ లో చూస్తూనే ఉన్నాం. ఇక్కడ హిట్ పడితే దర్శకులను వెతుక్కుంటూ నిర్మాతలు వస్తారు, అదే ప్లాప్ పడితే నిర్మాతలను వెతుక్కుంటూ దర్శకులు వెళ్ళాలి.

కొన్ని సినిమాలు రిలీజ్ అయినంతవరకు ఆ దర్శకుల ప్రతిభ ఏంటో తెలియదు, శివ రిలీజ్ కు ముందు రామ్ గోపాల్ వర్మ , బద్రి రిలీజ్ కంటే ముందు పూరి జగన్నాధ్ , అర్జున్ రెడ్డి రిలీజ్ కి ముందు సందీప్ రెడ్డి వంగ ఎవరికీ తెలియదు. తన మొదటి సినిమా ఉగ్రం తో మంచి పేరునే తెచ్చుకున్న ప్రశాంత్ నీల్, కెజిఫ్ సినిమాతో ఒక వెలుగు వెలిగారు. కన్నడ ఇండస్ట్రీ పై ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశారు.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెలుగు స్టార్స్ తో సినిమాలు చేస్తున్నారు.
ప్రభాస్ తో “సలార్” సినిమాని చేస్తున్న ప్రశాంత్ ఇప్పుడు “ఎన్టీఆర్ 31” వ సినిమాని చేయనున్నారు. అయితే ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు ఏ సినిమా అప్డేట్ ఇచ్చిన ఒకే థీమ్ లో ఉండే పోస్టర్స్ ను రిలీజ్ చేస్తున్నారు, అలానే డార్క్ ఫేస్ తో ఉండే పోస్టర్స్ ను ఇంకెంత కాలం రిలీజ్ చేస్తారో మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు