Prince: బోయపాటి తో సరికొత్త రోల్ లో

బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోగా రామ్ పోతినేని 20వ చిత్రం ఇది. ది వారియర్ తర్వాత రామ్, అఖండ వంటి భారీ విజయం తర్వాత బోయపాటి క్రేజ్ వోఎరిగిపోయింది. ఇక వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలవగా.. వీలైనంత తొందరగా ముగించేలా ప్లాన్ చేసుకుంటున్నారట టీం. అయితే తాజాగా ఈ సినిమా గురించి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో రామ్ ని ఢీ కొట్టేందుకు ఓ యంగ్ హీరోని విలన్ గా మార్చేస్తున్నారట బోయపాటి. పవర్ఫుల్ విలనిజాన్ని ప్రొఫషనల్ గా తెరమీద చూపించడంలో బోయపాటి శ్రీను అంటే ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉంది.

జగపతి బాబు కి బోయపాటి ఇచ్చిన బూస్ట్ అతని కెరీర్ ను సూపర్ హిట్ చేసింది. అలాగే అఖండ చిత్రంలో శ్రీకాంత్ విలన్ రోల్ చేశారు. ఆయనను కూడా ఎవరూ ఊహించని విధంగా చూపించడంతోపాటు, ఆయనలోని విలన్ ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు బోయపాటి. ఇప్పుడు కూడా రామ్ హీరోగా చేస్తున్న సినిమాతో మరొక హీరోను విలన్ చేస్తున్నారట.

- Advertisement -

ఆయన ఎవరో కాదు.. నీకు నాకు డాష్ డాష్ అనే చిత్రంతో పరిచయమై, బస్ స్టాప్, రొమాన్స్ చిత్రాలతో మంచి గుర్తింపుని తెచ్చుకున్న ప్రిన్స్ సెసిల్. అవును ఈ సినిమాలో ప్రిన్స్ పవర్ఫుల్ విలన్ గా నటిస్తున్నారట. ఈ సినిమాలో ప్రిన్స్ రోల్ సినిమాకే హైలెట్ కానుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరుగుతుంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు