Sivakarthikeyan : ట్రైల‌ర్ అప్పుడే ?

త‌మిళ న‌టుడు శివ‌కార్తికేయ‌న్ హీరోగా న‌టిస్తున్న చిత్రం ప్రిన్స్‌. ఈ సినిమా దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 21న విడుద‌ల‌వుతోంది. దీపావ‌ళి రేస్‌లో ఈసారి సినిమాలు బాగానే ఉన్న‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు త‌మిళ న‌టుడు కార్తీ న‌టించిన ‘స‌ర్దార్‌’, మంచు విష్ణు న‌టించిన ‘జిన్నా’, విశ్వ‌క్ సేన్ న‌టించిన ‘ఓరిదేవుడా’ వంటి సినిమాలు కూడా అదేరోజు విడుద‌ల‌వ్వ‌డం విశేషం. జాతిర‌త్నాలు ఫేమ్ కే.వీ. అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రిన్స్ సినిమా తెర‌కెక్కుతోంది.

త‌మిళంతో పాటు తెలుగులో ఏకకాలంలో ప్రిన్స్ సినిమా తెర‌కెక్కింది. శివ కార్తికేయ‌న్ న‌టిస్తున్న తొలి ద్విభాష చిత్రం ప్రిన్స్ కావ‌డం విశేషం. శివ‌కార్తికేయ‌న్‌కి జోడిగా మారియా ర్యాబోష‌పాకా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఉక్రెయిన్‌కి చెందిన మారియా హిందీలో స్పెష‌ల్ ఓప్స్ అనే సిరీస్ చేసింది. ప్రిన్స్ సినిమాతో ద‌క్షిణాదిలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌నుంది. ఇక ఈ ఏడాది శివ‌కార్తికేయ‌న్ హీరోగా న‌టించిన డాన్ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. దాదాపు రూ.100 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసిందనే చెప్ప‌వ‌చ్చు. ఇక ఆ సినిమా స‌క్సెస్ సాధించిన త‌రువాత ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

తెలుగు, త‌మిళ ద్విభాష చిత్రాన్ని చేస్తున్నాడు అనుదీప్‌. ఈ చిత్రాన్ని తొలుత ఆగ‌స్టు 30న విడుద‌ల చేస్తార‌ని ప్ర‌క‌టించారు. కానీ అప్పుడు విడుద‌ల కాకుండా వాయిదా ప‌డిందని ఆ స‌మ‌యంలో ఓ ఫ‌న్ని వీడియోను విడుద‌ల చేసి అనౌన్స్ చేశారు. తాజాగా ఓ వీడియోని విడుద‌ల చేస్తూ అక్టోబ‌ర్ 9న ప్రిన్స్ ట్రైల‌ర్ విడుద‌లంటూ శివ‌కార్తీకేయ‌న్ ఫ‌న్నీగా తమిళం, తెలుగు భాషల్లో చెప్ప‌డం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు