Priya Prakash Varrier : అతను అంటే క్రష్

ప్రియా ప్రకాష్ వారియర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓవర్ నైట్ స్టార్. కేవలం కన్నుకొట్టి కుర్ర కారు గుండెల్ని పిండేసింది. నితిన్ హీరోగా తెరకెక్కిన “చెక్” మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ప్రియా ప్రకాష్ వారియర్. మరోవైపు కన్నడ, మలయాళ భాషలలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. 2018లో “తనహ” అనే చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన ప్రియా ప్రకాష్ వారియర్ ఇప్పుడు బాలీవుడ్ స్థాయికి ఎదిగిపోయింది.

ప్రస్తుతం  ఈమె కన్ను కోలీవుడ్ పై పడినట్లు ఉంది. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రియా వారియర్ ఇన్ స్టాగ్రామ్ లో హీరో ధనుష్ కి సంబంధించిన విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా రిపోర్టర్ ఇదే విషయంపై ప్రశ్నించగా.. అందుకు ప్రియా వారియర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు ధనుష్ అంటే క్రష్ అని, అదోరకం పిచ్చి అని పేర్కొంది. ధనుష్ తో కలిసి నటించాలని చాలాకాలంగా కోరుకుంటున్నాను అని తెలిపింది. 

అలాంటి అవకాశం త్వరలోనే వస్తుందని భావిస్తున్నట్లు కూడా ప్రియా వారియర్ తెలిపింది. దీంతో ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ  వైరల్ అవుతున్నాయి.. అయితే కోలీవుడ్ లోకి అడుగు పెట్టడానికే ప్రియా వారియర్ ఈ కామెంట్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ఒక చిత్రం, హిందీలో మూడు చిత్రాలు, మలయాళం లో రెండు చిత్రాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు