Priyanka Arul Mohan : ఇక్కడ రిజక్ట్.. అక్కడ స్టార్ హీరోయిన్..!

నాని-విక్రమ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన `నానీస్ గ్యాంగ్ లీడ‌ర్` చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక అరుళ్ మోహ‌న్. ఈ సినిమాలో ఈమె హీరోయిన్ గా ఫిక్స్ అయినప్పటి నుండీ ఈమె లుక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమాలో ఈమె మంచి నటన కనపరిచినా సినిమా ప్లాప్ అవ్వడంతో ఈమె ట్యాలెంట్ బయటపడలేదు.తర్వాత శ‌ర్వానంద్ తో చేసిన `శ్రీ‌కారం` కూడా ప్లాప్ అయ్యింది. దాంతో ఈ అమ్మడు టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసి తన సొంత ఇండస్ట్రీ అయిన కోలీవుడ్ కు చెక్కేసింది.

అక్కడ ఈమె చేసిన ‘డాక్టర్’ ‘డాన్’ చిత్రాలు హిట్ అయ్యాయి. తెలుగులో కూడా ఆ సినిమాలు బాగా ఆడాయి. ‘ఈటి’ చిత్రం తమిళ్ లో ప్లాప్ అయినా తెలుగులో మాత్రం యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. దీంతో టాలీవుడ్ నుండీ ఇప్పుడు ఈమెకు అవకాశాలు వస్తున్నా ఆమె ఇటు వైపు చూడడం లేదు అని వినికిడి. తమిళంలో మాత్రం ఆల్రెడీ రెండు ప్రాజెక్టులు ఓకే చేసిందట. అందులో ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమా కూడా ఉందని తెలుస్తుంది. ఇంకో రెండు హిట్లు పడితే తమిళ్ లో ఈమె స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం. కానీ టాలీవుడ్లో ఈమెకు బ్రేక్ వస్తుందా లేదా అన్నది చూడాలి..!

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు