Priyanka Chopra : హాలీవుడ్ మూవీ వాయిదా

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తోంది. ఈమె 2016 లో ‘బేవాచ్’ అనే హాలీవుడ్ చిత్రం చేసిన తర్వాత వరుసగా ఇంగ్లీష్ సినిమాలే చేస్తుంది. అప్పటి నుంచి ప్రియాంక బాలీవుడ్ లో కేవలం ఒకే ఒక సినిమా చేసింది. ఒక హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత హాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. ఈమె నుంచి ఇటీవల వచ్చిన ఇంగ్లీష్ చిత్రం ది మ్యాట్రిక్స్ రెజుర్రెక్షన్స్.

తాజాగా ఈ బ్యూటీ మరో సినిమా చేస్తుంది. జిమ్ స్ట్రౌస్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా తో పాటు సామ్ హేగన్ కీలక పాత్రలు చేయబోతున్నారు. ఈ చిత్రం ఎస్ఎంఎస్‌ ఫర్ డిచ్ అనే జర్మన్ సినిమా ఆధారంగా తెరెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో భర్త చనిపోయిన యువ‌తి పాత్రలో ప్రియాంకచోప్రా కనిపించబోతుంది. ఒక యువతి తన భర్త చనిపోయిన తర్వాత, భర్త ఫోన్ కి మెసేజ్ లు చేస్తుంది. కానీ ఆ నెంబర్ వేరే వ్యక్తికి కేటాంయిచడం వల్ల రీప్లై వ‌స్తుంటాయి. దీంతో తన భర్త బతికే ఉన్నాడని అనుకుంటుంది ఆ యువతి. అప్పుడు కథలో వచ్చే మలుపులు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.

ఇది ఇలా ఉండగా ఈ చిత్రాన్ని ముందుగా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీన విడుదల చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించారు. కానీ తాజాగా మరో ప్రకటన చేశారు. సినిమా విడుదలకు మరింత ఆలస్యం అవుతుందని తెలిపారు. వచ్చే ఏడాది మే 12 న‌ విడుదల చేస్తామని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. అప్పుడైనా విడుద‌ల‌వుతుందో లేక విడుద‌ల తేదీ మారుతుందో అనేది వేచి చూడాలి మ‌రి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు