Project K : మరింత హైప్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం “ప్రాజెక్ట్ కె”. డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రాజెక్ట్ కె నుంచి ఓ అప్డేట్ ని విడుదల చేసింది మూవీ యూనిట్. ఈ అప్డేట్ ను ఆదివారం మధ్యాహ్నం విడుదల చేయబోతున్నట్లు ప్రకటించినప్పటికీ.. కాస్త ఆలస్యం కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఎట్టకేలకు ప్రాజెక్ట్ కె మేకర్స్ అప్డేట్ ని ప్రకటించారు. ప్రభాస్ పుట్టినరోజుని పురస్కరించుకొని ఓ పోస్టర్ ని షేర్ చేసింది మూవీ యూనిట్.

ఇందులో ప్రభాస్ చేయి.. ఓ సూపర్ హీరో చేయిలా కనిపించింది. అలాగే పోస్టర్ పై ఓ క్యాప్షన్ ని జోడిస్తూ.. ” హీరోలు పుట్టరు.. ఉద్భవిస్తారు”. అని పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలోని భారీ యాక్షన్స్ సన్నివేశాలను చిత్రీకరించడానికి హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లను రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. ఇక మహానటి వంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ఇది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్విని దత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరా సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు