PSPK29: ఘిబ్రన్ వద్దు అనిరుధ్ కావాలి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రన్ రాజా రన్, సాహో సినిమాల దర్శకుడు సుజిత్ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. PSPK29 పేరుతో ఇటీవల అధికారికి ప్రకటన వచ్చేసింది. #OG అని సినిమాను పిలుస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. హరిహరవీరమల్లు పూర్తి అయిన తర్వాత, హరీష్ శంకర్ తో ఓ సినిమాను పూర్తి చేసి సుజిత్ తో PSPK29 ను ప్రారంభించే అవకాశం ఉంది.

అయితే PSPK29 కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఒక డిమాండ్ ను ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమాకు సౌత్ సంచలన మ్యూజిక్ దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ తీసుకోవాలని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. అయితే PSPK29 కు ఇప్పటి వరకు కాస్ట్ అండ్ క్రూను డైరెక్టర్ సుజిత్ ఎంపిక చేయలేదు. అయితే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఘిబ్రన్ ఉండబోతున్నాడని తెలుస్తుంది.

సుజిత్ దర్వకత్వంలో వచ్చిన ప్రతి సినిమా క్రూలో ఘిబ్రన్ ఉంటాడు. సుజిత్ తొలి చిత్రం రన్ రాజా రన్ లో ఘిబ్రన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నాడు. రెండో చిత్రమైన ప్రభాస్ సాహోకు ఘిబ్రన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇప్పుడు సుజిత్ మూడో చిత్రం PSPK29కు కూడా ఘిబ్రన్ ఉండబోతున్నాడని ఇప్పటికే టాక్ వస్తుంది. దీనికి బలం చేకూర్చేలా ఘిబ్రన్ తన సోషల్ మీడియాలో అకౌంట్ లో PSPK29 పోస్టర్ ను షేర్ చేశాడు. దీంతో పవర్ ఫ్యాన్స్ ఈ చిత్రానికి ఘిబ్రన్ కు కాకుండా అనిరుధ్ ను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్, అనిరుధ్ కాంబినేషన్ లో ఇప్పటికే అజ్ఞాతవాసి చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మ్యూజిక్ పరంగా సూపర్ హిట్ అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు