PSPK29 : సుజిత్ మూవీ సులువు అవుతుందా ?

పవర్ స్టార్ కళ్యాణ్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్, ఆయన సినిమాలకు ఉండే ఆదరణ అంత ఇంత కాదు. కెరీర్ లో మొదటి సినిమా “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయ్” నుంచి ఇటీవల వచ్చిన “భీమ్లా నాయక్” వరకు ప్రతి సినిమా ఒక సంచలనం గానే ఉంటుంది. కెరీర్ లో కొన్ని ఫ్లాప్స్ వచ్చినా, ఆయన క్రేజ్ కు ఎలాంటి ఇబ్బంది రాలేదు. పవన్ కళ్యాణ్ ఇటీవల రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. అయినా పవర్ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు.

అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంత వరకు అసహనంతో ఉన్నారు అనేది మాత్రం వాస్తవం. ఈ గబ్బర్ సింగ్ నుంచి సినిమా రాకా చాలా రోజులు అవుతుంది. ఒక వైపు వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. కానీ షూటింగ్స్ మాత్రం జరగడం లేదు.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరి హర వీరమల్లు అనే సినిమాను అనౌన్స్ చేసి ఇప్పటికే రెండు సంవత్సరాలు కావస్తోంది. ఇంకా షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకోలేదు. ఇక హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ ప్రకటించి దాదాపు మూడేళ్లు అవుతుంది. అది ఇంకా సెట్స్ పైకే రాలేదు. సముథ్ర ఖని తో వినోదయ సిత్తం కు రీమేక్, దానికి ముందు సురేందర్ రెడ్డితో మరో సినిమా అనౌన్స్ చేశాడు. వీటి గురించి ప్రస్తుతం ఎక్కడా కూడా టాపిక్ లేదు.

- Advertisement -

తాజాగా సాహో దర్శకుడు సుజిత్ తో కొత్త సినిమాను ప్రకటించాడు. దీన్ని PSPK29 గా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం హరి హర వీరమల్లు PSPK27 గా ఉంది. ఇది పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. దీని తర్వాత PSPK28 ఉంటుంది. ఇది హరీష్ శంకర్ తో ఉండబోతుంది. పవన్-హరీష్ కాంబోలో భవదీయుడు భగత్ సింగ్ అని చెప్పారు.

కానీ, పవన్ కు ఈ స్టోరీ నచ్చలేదని టాక్. దీంతో మరో స్టోరీ వేటలో ఉన్నాడట హరీష్. కొత్త స్టోరీ రావడం.. దాన్ని పవన్ ఒప్పుకోవడం, షూటింగ్ జరగడం, అన్నింటి కంటే ముఖ్యంగా పవన్ డేట్స్ ఇవ్వడం, షూటింగ్ పూర్తివ్వడం, సుజిత్ సినిమా స్టార్ట్ అవడం.. ఇదంత జరగడానికి ఎంత టైం పడుతుంది అంటే.. ఎవరు కూడా స్పష్టమైన జవాబు ఇవ్వలేరు.

పైగా పవర్ స్టార్ ఆంధ్ర ప్రదేశ్ లో బస్ యాత్రకు కూడా పూనుకుంటున్నాడు. ఈ యాత్ర సమయంలో షూటింగ్ మాట అస్సలు ఉండదు. ఇన్ని సమస్యల మధ్య సుజిత్ మూవీ సులవుగా సెట్స్ పైకి వెళ్లాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు