Pushpa 2: ఫహద్ ఫాజిల్ తో ఎందుకలా ఆడుకుంటున్నారు

Pushpa 2: ప్రస్తుతం ఇండియన్ సినిమాకి ఉన్న విలక్షణమైన నటులలో ఫహద్ ఫాజిల్ ఒకరు. పేరుకు మలయాళం హీరో అయినా కూడా ఫహద్ ఫజిల్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఓటీటి పుణ్యమా అంటూ ప్రతి భాషలో సినిమాలను తెలుగు ప్రేక్షకులు అర్థం కాకపోయినా కూడా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూశారు. ఈ తరుణంలో ఒక చోట ఆగిపోయి ట్రాన్స్ సినిమాతో ఫహద్ ఫాసులకి అందరూ కనెక్ట్ అయిపోయారు. అయితే ఆ సినిమా తర్వాత ఫహద్ ఫాజిల్ చేసిన సినిమాలను వెతుక్కుని మరీ చూసిన ఆడియన్స్ ఉన్నారు. ఇక్కడితో ఫహద్ ఫాజిల్ రేంజ్ వేరే రేంజ్ కి ఎదిగిపోయింది.

ఇకపోతే తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్పా సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మాట్లాడడానికి కేరళ కు వెళ్ళాడు సుకుమార్. అయితే అప్పటికే సుకుమార్ గురించి తెలిసిన ఫహద్ వైఫ్ నజ్రియా వస్తున్న డైరెక్టర్ బాగా టాలెంటెడ్ తను ఏ కథ చెప్పినా కూడా మీరు ఓకే చేసేయండి అంటూ ఫహద్ కి చెప్పుకొచ్చారు. అయితే సుకుమార్ చెప్పిన కథ వినగానే ఓకే చెప్పేసాడు ఫహద్ ఆ రకంగా విజయ్ సేతుపతి నటించాల్సిన రోల్ లో ఫహద్ ఫాజల్ కనిపించాడు.

Fahadh Faasil

- Advertisement -

పుష్ప సినిమాలో ఫహద్ ఫాజిల్ ఎంతటి కీలకపాత్రను పోషించారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో ఫహద్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వాస్తవానికి సుకుమార్ ఈ కథను ఫహద్ చెప్పేటప్పుడు చాలా అద్భుతంగా తన క్యారెక్టర్ ను డిజైన్ చేసి చెప్పాడట కానీ సినిమా విషయానికి వస్తే కేవలం విలన్ గా మాత్రమే ఫహాద్ చూపించాడు. ఇకపోతే పుష్ప టు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఫహద్ సీన్స్ ఇంకా పూర్తి కాలేదట. మరోవైపు మలయాళం సినిమా పీక్ రేంజ్ లో ఉంది అక్కడ ఫహద్ వరస ప్రాజెక్ట్స్ కమిట్ అయి ఉన్నాడు. ఈ తరుణంలో పుష్పా సినిమా కోసం డేట్స్ మారటం అనేది ఇబ్బందిగా మారి, సుకుమార్ తో బేధాభిప్రాయాలు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు