Raashi Khanna: బాహుబలి ఛాన్స్ మిస్ చేసుకున్న నటి !

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదట ఊహలు గుసగుసలాడే అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

తన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న ఈమె ఆ తర్వాత గోపీచంద్ హీరోగా నటించిన జిల్ సినిమాలో కూడా నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. మంచి పేరు రావడంతో వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. నిజానికి మద్రాస్ కేఫ్ అనే హిందీ సినిమాతోనే ఆమె వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది.

అయితే తాజాగా ఈ బ్యూటీ బాహుబలి సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “నేను నటించిన మద్రాస్ కేఫ్ సినిమా అయిపోయాక రాజమౌళి సార్ బాహుబలి సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. తమన్నా నటించిన అవంతిక పాత్ర కోసం ఆడిషన్ జరిగింది. నాకు పిలుపు వచ్చింది, వెళ్ళాను. కానీ రాజమౌళి సార్ నన్ను చూసి చాలా క్యూట్ గా ఉంది అమ్మాయి, ఏదైనా లవ్ స్టోరీ కి బాగా సెట్ అవుతుంది అన్నాడు. నా స్నేహితుడు ఒకరు మంచి ప్రేమకథపై వర్క్ చేస్తున్నాడు. ఓసారి ఆ కథ విను. నీకు తప్పకుండా నచ్చుతుంది అన్నారు. అలా ఊహలు గుసగుసలాడే తో నేను తెలుగులో లాంచ్ అయ్యాను. కానీ రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర అయినా చేయాలనుంది” అని చెప్పుకొచ్చింది రాశీఖన్నా.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు