Raashii Khanna : బాలీవుడ్ హీరోలకు అది కష్టమే..!

ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇక్కడి నుంచి వచ్చిన సినిమాలు వరుసగా సంచలనాలను సృష్టిస్తున్నాయి. బాహుబలి నుంచి సౌత్ ఇండిస్ట్రీ రూపురేఖలు మారిపోయాయి. దీని తర్వాత వచ్చిన పుష్ప కేజీఎఫ్ తో పాటు ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్, కాంతార సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ వేదికలపై అవార్డులను అందుకుంటూ దూసుకెళ్తుంది.

ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ ఇప్పటికే అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలకు హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో కూడా ఆదరణ వచ్చింది. అక్కడి ప్రేక్షకులు ఆ సినిమాలను ఆధరించడమే కాదు.. హీరోలకు కూడా అభిమానులు అయిపోయారు.

అయితే ఇలాంటి పరిస్థితి బాలీవుడ్ లో కనిపించడం లేదు. గత రెండేళ్ల నుంచి బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించడం లేదు. దీనిలో తాజాగా వచ్చిన పఠాన్ సినిమాకు మినహాయింపు ఉంటుంది అనుకోండి. పఠాన్ మినహా, హిందీలో గత రెండేళ్ల నుంచి చెప్పుకొదగ్గ సినిమా ఒక్కటి కూడా రాలేదు. పఠాన్ ఇటీవలే 800 కోట్ల వసూళ్లు చేసింది. అయితే ఈ సినిమా సౌత్ లో మాత్రం పెద్దగా ఆడటం లేదు. కలెక్షన్ల పరంగా కూడా అంతంత మాత్రంగానే ఉంది.

- Advertisement -

అంటే సౌత్ హీరోలు.. హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో సెక్సెస్ అవుతున్నారు. కానీ, బాలవుడ్ హీరోలు మాత్రం సౌత్ లో పేరు తెచ్చుకోవడంలో విఫలమవుతున్నారు. ఈ విషయాన్నే హీరోయిన్ రాశి ఖన్నా.. ఓ సందర్భంలో స్పందించింది. ఈ భామ ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఫర్జీ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. దీని ప్రమోషన్ లో భాగంగా సౌత్ – నార్త్ పై పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

“సౌత్ లో వచ్చిన సినిమాలు బాలీవుడ్ లో రికార్డులు బద్దలు కొడుతాయి. అక్కడి హీరోలను ఉత్తరాది ప్రేక్షకులు ఆదరిస్తారు.. అభిమానిస్తారు. కానీ, సౌత్ లో ఈ ధోరణి లేదు. బాలీవుడ్ హీరోలను సౌత్ ప్రేక్షకులు ఓన్ చేసుకోవడం లేదు. సౌత్ లో హీరోలుగా వెలగడం బాలీవుడ్ హీరోలకు అంత ఈజీ కాదు” అంటూ చెప్పుకొచ్చింది. దీనిపై దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే స్పందించారు. బాలీవుడ్ హీరోలు.. సౌత్ లో విలన్స్ గానే పేరు తెచ్చుకుంటున్నారు కానీ హీరోలుగా మారడం లేదు అంటూ కామెంట్ చేశారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు