Radhika Apte : ఆఫర్ల కోసం సర్జరీలు చేసుకోలేదు

రాధిక ఆప్టే.. చేసింది తక్కువ సినిమాలే అయినా ఏ హీరోయిన్ కి రాని పాపులారిటీ ఈ భామకి వచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలలోకి అడుగుపెట్టిన ఈ భామ అన్ని విధాలుగాను అభిమానులను ఆకట్టుకుంది. అలాగే నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తలలో నిలిచేవారిలో ముందు వరుసలో ఉంటుంది రాధిక ఆప్టే. తన వ్యక్తిగత జీవితం, సినిమా ఇండస్ట్రీ గురించి ఈమె చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. ఈమె ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్లుగానే మాట్లాడుతుంది.

తాజాగా బాలీవుడ్ హీరోయిన్స్ పై రాధిక ఆప్టే చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బాలీవుడ్ లో హీరోయిన్స్ అందం కోసం చేయించుకునే సర్జరీలపై సంచలన వ్యాఖ్యలు చేసింది రాధిక. “చాలామంది బాలీవుడ్ హీరోయిన్స్ లా.. నేను సర్జరీలు చేయించుకోలేదు. అలా చేసుకుని ఉంటే నాకు మరిన్ని అవకాశాలు వచ్చేవేమో. సినిమాలలో ఆఫర్ల కోసం సర్జరీలు చేయించుకున్న వారు కూడా ఉన్నారు. ప్రతిభను కాకుండా ఫిజిక్ ను బట్టి అవకాశాలు ఇవ్వడం ఒక ఇండియాలోనే కాకుండా విదేశాలలోనూ ఉంది” అంటూ ఆసక్తిరమైన వ్యాఖ్యలు చేసింది.

అలాగే “అందంగా ఉన్నారనే కారణంతో నాకు వచ్చిన అవకాశాలను కొందరు హీరోయిన్లు ఎగరేసుకుపోయారు. వాళ్లలా అందం కోసం నేను సర్జరీలు చేయించుకోలేదు. ఇప్పుడిప్పుడే దీనికి వ్యతిరేకంగా మహిళలు గళం విప్పుతున్నారు. ఛాన్సుల కోసం కాకుండా కంటెంట్ బాగుండే కథలపై దృష్టి పెట్టాలి. రెమ్యూనరేషన్ తక్కువగా ఉన్నా హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎంచుకోవాలి” అంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -

కాగా ఈ ఏడాది రాధిక ఆప్టే ఫోరెన్సిక్, విక్రమ్ వేద, మోనికా ఓ మై డార్లింగ్ చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు