Radhika Apte : మెగా ఫోన్ పెట్టేందుకు రెడీ

బాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే ఒక సంచలనం. బాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ లో ఈమె డిఫరెంట్ గా ఉంటుంది. చాలా మంది హీరోయిన్స్ చాలా సినిమాలు చేస్తే గానీ పాపులారిటీ రాదు. కానీ, ఈ భామకు కొన్ని సినిమాలతోనే మంచి పాపులారిటీ వచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలలోకి అడుగుపెట్టిన ఈ భామ.. అన్ని విధాలుగాను అభిమానులను ఆకట్టుకుంది. ఈ బ్యూటీ ఏం మాట్లాడినా సరే ఒక సంచలనం.

వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ కూడా వార్తల్లో ఉండడం ఆమె స్టైల్. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా సిగ్గు విడిచి చెబుతుంది రాధిక. తమిళంలో ధోనీ చిత్రంతో నటిగా రంగ ప్రవేశం చేసిన ఈ బాలీవుడ్ బ్యూటీ.. రజనీకాంత్ కబాలి చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలలో బిజీ అయింది.

ఇప్పుడు రాధిక దృష్టి దర్శకత్వం పై పడింది. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే హీరోలని డైరెక్ట్ చేయడానికి సిద్ధం అవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధిక ఆప్టే మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీలోకి మొదట దర్శకురాలు కావాలని అడుగుపెట్టానని.. కానీ అనూహ్యంగా హీరోయిన్ అయ్యానని తెలిపింది. మొదట ఇండస్ట్రీలో దర్శకత్వం శాఖలో శిక్షణ పొందినట్లు పేర్కొంది. అది తన నటనకు చాలా ఉపయోగపడిందని తెలిపింది రాధిక.

- Advertisement -

అయితే ఇప్పుడు స్క్రీన్ ప్లే రూపొందించడంలో తగిన శిక్షణ పొందాలని.. అందుకు తగ్గట్లుగా ప్రముఖ దర్శకుల వద్ద పనిచేయాలనుకుంటున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో కొన్ని కథలను కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించింది. అలాగని నటనకు స్వస్తి చెప్పడం లేదని.. దర్శకత్వం చేస్తూనే నటనకి కూడా ప్రాధాన్యం ఇస్తానని పేర్కొంది. మరి ఈ అమ్మడు తన మొదటి సినిమా ఏ హీరోతో, ఏ భాషలో దర్శకత్వం వహిస్తుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు