Rudrudu : రజినీకాంత్ ను పోలి..

రాఘవ లారెన్స్.. కొరియోగ్రాఫర్ గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి విజయవంతమైన డాన్సర్ గా స్థిరపడ్డాడు. అనేక సపోర్టింగ్ రూల్స్ చేసిన తర్వాత ప్రధాన పాత్రలు చేయడం ప్రారంభించాడు. దర్శకుడిగా కూడా రంగ ప్రవేశం చేసి సినిమాలలో మల్టీ టాలెంటెడ్ స్టార్ గా ఎదిగారు. రాఘవ లారెన్స్ ఎక్కువగా హారర్ డ్రామాలో నటించాడు. అవన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. తాజాగా రాఘవ లారెన్స్ హీరోగా నటించడంతో పాటు స్వియ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం “రుద్రుడు”.

ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్ కథానాయిక గా నటిస్తోంది. పూర్ణిమ, శరత్ కుమార్, భాగ్యరాజ్, నాజర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతం అందించగా.. ఆర్. డి రాజశేఖర్ ఛాయాగ్రహణం. తమిళంలో రుద్రన్ పేరుతో రూపొందుతున్న ఈ మూవీని తెలుగులో రుద్రుడు పేరుతో రిలీజ్ చేయనున్నారు.

అయితే ఈ చిత్రం నుండి లారెన్స్ లుక్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలలో అతను చూడడానికి రజనీకాంత్ లా కనిపిస్తున్నాడు. బ్లాక్ డ్రెస్ లో లారెన్స్ లుక్ అదిరింది. ఆ లుక్ రజనీకాంత్ ని గుర్తు చేస్తోందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు