Rajamouli : నా ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్

రాజమౌలి దర్శకత్వం వహించిన పాన్ ఇండియా చిత్రం RRR. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ హీరోలుగా అలియా భట్ తో పాటు మరెందరో గొప్ప నటులు నటించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం…దానికి దగ్గటుగానే ప్రశంశలు కూడా అందుకుంది. RRR సినిమా సాధించిన రికార్డులు అరుదయిన అవార్డులు గురించి అందరికి తెలిసిందే. ప్రపంచమంటా రిలీజ్ అవుతూ తెలుగు ఇండస్ట్రీ తోపాటు భారత చలన చిత్ర పరిశ్రమకు కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెడుతుంది.

ఇది ఇలా ఉండగా RRR సినిమాలోనీ కొమురం భీముడొ అనే పాట ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంశలు కూడా అందుకుంది. ఈ పాటలో నటించిన ఎన్టీఆర్, తన నటనతో అందరి మనసు దోచుకున్నాడు. ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్స్ కి ఫ్యాన్స్ మంత్ర ముగ్దులు అయారు.

ఈ పాటని గుర్తు చేసుకుంటూ ఆస్కార్ ఓటర్ల స్క్రీనింగ్ ఇంటర్వ్యూ లో “కొమురంభీముడో పాట నా అన్ని సినిమాలలో నా ఆల్ టైమ్ ఫేవరెట్, ఆ సన్నివేశం నా కెరీర్‌లో నేను డైరెక్ట్ చేసిన అత్యుత్తమ విషయం. మీరు కెమెరాను ఒక చిన్న కనుబొమ్మపై మాత్రమే ఉంచినప్పటికీ, అతను కనుబొమ్మతో ప్రదర్శన చేయగలడు”. అంటూ లో జక్కన్న సెలవిచ్చాడు. RRRలో కొమరం భీమ్ పాత్ర కోసం వెరైటీ యొక్క 2023 ఆస్కార్ ఉత్తమ నటుడిలో జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. దాని వల్ల RRR ప్రపంచవ్యాప్తంగా అందుకుంటున్న గుర్తింపు రోజురోజుకు పెరుగుతోంది.

- Advertisement -

For More Updates :
Grab Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు