Rajamouli : తను సక్సెస్ సీక్రెట్ అదేనంటున్నరాజమౌళి

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లిన దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటారు. ఈ దర్శకుడు తీసిన బాహుబలి సినిమా తెలుగు సినీ చరిత్రను మార్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి ప్రశంసలు వచ్చాయి. ఇక ఈ సినిమా తరువాత ఈ దర్శకుడు తీసిన RRR సినిమా అయితే ఏకంగా ఆస్కార్ రేస్ లో పోటీ పడుతూ తెలుగు వారు గర్వించే విధంగా కొనసాగుతూ ఉంది. త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరం కావొస్తుందా కానీ ఈ సినిమా క్రేజ్ ఇంకా ఎన్నో దేశాలలో కొనసాగుతూనే ఉంది.

అయితే ఈ దర్శకుడి హవా బాహుబలి సినిమాతో టాలీవుడ్ లో మొదలు కాలేదు. అంతకుముందు కూడా అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి అసలు ఫ్లాప్ లేని డైరెక్టర్ గా నిలిచారు రాజమౌళి. తన మొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ఇప్పటి త్రిబుల్ ఆర్ వరకు రాజమౌళి ఖాతాలో ఒక్క ఫ్లాపు కూడా లేకపోవడం కాకుండా అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ కావడం విశేషం. అయితే ఇది సాధారణమైన విషయం కాదు, ప్రతి ఒక్క దర్శకుడు ఏదో ఒక్కసారి అన్న తప్పు చేస్తాడు. కానీ రాజమౌళి అది ఇప్పటివరకు చేయలేదు, ‌ దాంతో రాజమౌళి సక్సెస్ సీక్రెట్ ఏంది అని అనేకమందికి డౌట్ ఉంది.

- Advertisement -

అయితే దీనిపై మొదటి సారి స్పందించారు ఈ దర్శకుడు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి తన సక్సెస్ సీక్రెట్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘‘విజయానికి విడిగా రహస్యం అంటూ ఏమీ ఉండదు. కానీ ఇక్కడ రెండు విషయాలు చెబుతాను. ముందుగా మనకు ప్రేక్షకులతో ఒక రిలేషన్ ఉండాలి. ఆడియన్స్ పల్స్ తెలుసుకోవాలి. అందుకు తగ్గట్లు పని చేయాలి.

రెండో విషయం.. కష్టపడడం. మనం ఎంత కష్టపడితే విజయాన్ని అంతగా ఆస్వాదించగలం. సినిమా కమర్షియల్‌గా విజయం సాధిస్తే ఆ సమయంలో పొందే ఆత్మ సంతృప్తిని వర్ణించడానికి మాటలు చాలవు. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ముఖ్యం. ఒక సినిమా మొదలుపెట్టినపుడు అందరికీ రకరకాల సందేహాలు వస్తాయి. సినిమా విజయం సాధిస్తుందా లేదా అనిపిస్తుంది. కానీ ఎన్ని సందేహాలున్నా ఉత్సాహంగా పని చేయాలి. మనం నమ్మింది ఉత్తమంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాలి’’ అని తన సక్సెస్ సీక్రెట్ ని చెప్పుకోచేసాడు మన జక్కన్న.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు