Sukumar : సుకుమార్ జీవితాన్ని మార్చేసిన రాజశేఖర్.. ఎలా అంటే?

టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో కాదు కాదు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ స్టార్ డం సంపాదించుకున్న దర్శకులలో ఒకరైన సుకుమార్.. ఈరోజు ‘శేఖర్’ ప్రీ రిలీజ్ వేడుకకి అతిధిగా విచ్చేసాడు. రాజశేఖర్ హీరోగా నటించిన ఈ చిత్రానికి జీవిత దర్శకత్వం వహించారు.వారి పెద్ద కుమార్తె శివాని కూడా ఈ మూవీలో ఓ కీలక పాత్ర పోషించింది. మే 20న ఈ మూవీ విడుదల కాబోతుంది. దాంతో ప్రమోషన్లు వేగవంతం చేశారు. హైదరాబాద్లోని దస్పల్లా హోటల్లో ‘శేఖర్’ ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహించారు.

ఇక ఈ వేడుకకి అతిథిగా విచ్చేసిన సుకుమార్ మాట్లాడుతూ.. తను సినిమాల్లోకి రావడానికి ముఖ్య కారణం రాజశేఖర్ అని చెప్పుకొచ్చాడు. తన జీవితాన్ని కంప్లీట్ గా మార్చేసింది కూడా రాజశేఖరే అంటూ సుకుమార్ చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. విషయం ఏంటి అంటే… ‘ఆహుతి’ ‘ఆగ్రహం’ ‘తలంబ్రాలు’ ‘మగాడు’ అంకుశం’ వంటి సినిమాల టైములో రాజశేఖర్ కు సుకుమార్ పెద్ద ఫ్యాన్ అయిపోయాడట. అతని ఊర్లో అతని స్నేహితుడు సినిమా హీరోలందరినీ ఇమిటేట్ చేసి మెప్పించేవాడట. అతన్ని చూసి సుకుమార్ జలస్ గా ఫీలయ్యేవాడట. అయితే ఒకసారి రాజశేఖర్ ను సుకుమార్ ఇమిటేట్ చేశాడట. దాంతో అందరూ చప్పట్లు కొట్టి ప్రోత్సహించారట. తను సినిమాల్లోకి రాగలను అనే నమ్మకం అప్పుడే పొందాను అని సుకుమార్ తెలిపాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు