Rajinikanth : హిట్ కొట్టేనా ?

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ వ‌రుస సినిమాలు చేస్తున్న‌ప్ప‌టికీ గ‌త కొద్ది సంవ‌త్స‌రాల నుంచి బాక్సాఫీస్ వ‌ద్ద స‌రైన ఫ‌లితాల‌ను అందుకోలేక‌పోతున్నాడు. రోబో త‌రువాత ఆ స్థాయి స‌క్సెస్ ద‌క్క‌లేద‌నే చెప్పాలి. రోబో త‌రువాత కొచ్చాడ‌యాన్‌, లింగా, పెద్ద‌న్న‌, ద‌ర్బార్‌ కాలా, క‌బాలి, రోబో 2.0 సినిమాలేవి స‌క్సెస్ సాధించ‌లేక‌పోయాయి. వీటిలో కొన్ని సినిమాలు మోస్తారుగా న‌డిచాయి. కానీ సూప‌ర్ హిట్ కాలేదు. తాజాగా డాక్ట‌ర్‌, బీస్ట్ సినిమాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్‌తో ఓ సినిమా చేస్తున్నారు.

ప్ర‌స్తుతం ర‌జినీకాంత్ 169వ చిత్రం జైల‌ర్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. చెన్నై ఈసీఆర్ రోడ్డులోని ఆదిత్య‌రామ్ స్టూడియోలో షూటింగ్ నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆదిత్య‌రామ్‌, ర‌జినీకాంత్‌తో తీసుకున్న ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక ఆదిత్యరామ్ తెలుగులో సంద‌డే సంద‌డి సినిమాని నిర్మించాడు. జైల‌ర్ సినిమాను వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్‌లో ఉన్నారు. జైళ్ల‌లో సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చే జైలు అధికారి పాత్ర‌లో ర‌జినీకాంత్ న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

హిట్‌, ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా పా రంజిత్‌,శివ కార్తిక్ సుబ్బ‌రాజ్ వంటి యంగ్ ద‌ర్శ‌కుల‌తో ర‌జినీకాంత్ ప‌ని చేస్తున్నాడు. మొత్తానికి 11 ఏళ్ల కింద వ‌చ్చిన రోబో త‌రువాత ర‌జినీకాంత్‌కి స‌రైన విజ‌యం ద‌క్క‌లేదు. ఈ లోటు జైల‌ర్ సినిమాతో అయినా తీరుస్తాడో లేదో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు