Rajinkanth: రజినీ రేంజ్ కు సరిపడా హిట్ ఇస్తాడా.?

ఏ ఇండస్ట్రీ లో అయినా సక్సస్ కి ఉండే ఇంపార్టెన్స్ వేరు, ఒక హిట్ సినిమా పడితే స్టార్ హీరోలు పిలిచిమరీ డేట్స్ ఇస్తారు. అదే ఒక సినిమా ప్లాప్ అయితే కమిట్ అయిన ప్రాజెక్ట్స్ కూడా ఆగిపోయే సందర్భాలు ఉన్నాయ్. నెల్సన్ దిలీప్ కుమార్.. ‘బీస్ట్‌’ విడుదలకు ముందు ఓ స్టార్‌ డైరెక్టర్‌. కానీ ‘బీస్ట్‌’ విడుదల తర్వాత పొగిడిన నోళ్లే తిడుతున్నాయి. బీస్ట్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ప్రస్తుతం రజినీకాంత్ తో చెయ్యాల్సిన సినిమా ఆగిపోయినట్లు ఆ మధ్య కోలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి.

కానీ కొందరు హీరోలు మాత్రం ఒక్కసారి కమిట్ అయితే దర్శకుల హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తారు, పా.రంజిత్ చేసిన “కబాలి” సినిమా అనుకున్న రేంజ్ లో హిట్ కాకపోయినా,మళ్ళీ తనకు “కాలా” సినిమా అవకాశం ఇచ్చారు రజినీ. అప్పటికి స్టార్ హీరో తో చేసిన ఎక్స్పీరియన్స్ లేకపోయినా కార్తీక్ సుబ్బరాజ్ కి “పేట” సినిమా ఇచ్చారు రజినీ. అలానే ఇప్పుడు కూడా నెల్సన్ తో సినిమా ఉండబోతుంది.

రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “అన్నాత్తే” తమిళ నాట మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. కానీ ఓవరాల్ గా అయితే ఇది కూడా రజినీ రేంజ్ సినిమా కాదనేది చాలామంది అభిప్రాయం. రజినీ ప్రస్తుతం తన 169వ సినిమాని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో చెయ్యడానికి ఫిక్స్ అయ్యారు. అయితే ఈ సినిమా ఆగస్టు నుంచి మొదలు కానుందట. ఇక ఈ సినిమాకు కూడా అనిరుధ్ నే సంగీతం అందిస్తున్నాడు. బీస్ట్ తో ఆశించిన స్థాయి హిట్ ఇవ్వని నెల్సన్ ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ ఇస్తాడో వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు