IIFA2023: మూడు పెళ్లిళ్ల రాయుడు.. రాఖీ సావంత్ అంత మాట అనేసిందేంటి ?

ఇటీవల అబుదాబి వేదికగా ప్రఖ్యాత IIFA 2023 అవార్డుల కార్యక్రమం అత్యంత గ్రాండ్ గా జరిగిన సంగతి విధితమే. ఇందులో భాగంగా, బెస్ట్ హీరో గా హ్రుతిక్ రోషన్, బెస్ట్ హీరోయిన్ గా అలియా భట్ అవార్డులను అందుకున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రెటీలు రెడ్ కార్పెట్ పై సందడి చేశారు. బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోయిన్స్ కూడా రెడ్ కార్పెట్ పై తళుక్కుమని మెరిశారు.

అయితే ఇందులో బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ, వివాదాస్పద నటి రాఖీ సావంత్ కూడా రెడ్ కర్పెట్ పై సందడి చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ ఓ సినిమా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఈమె చెప్పిన సమాధానం ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. అలాగే కొంత వరకు కాంట్రవర్సీని కూడా క్రియేట్ చేస్తోంది. ఆ ప్రశ్న ఏంటంటే.. “బాలీవుడ్ లో హాటెస్ట్ గా ఉన్న నటీనటుల పేర్లు చెప్పండి” అంటూ రాఖీ సావంత్ ను ఆడిగారు. దీనికి ఈ వివాదాస్పద నటి ఫస్ట్ షారుక్ అని, తర్వాత సల్మాన్ అని చెప్పింది. “మూడో వ్యక్తి ఎవరంటే… ప్రస్తుతం మూడో పెళ్లి చేసుకుంటున్న అమీర్ ఖాన్ అయి ఉండొచ్చు. కానీ అది నాకు కూడా తెలియదు” అంటూ సమాధానం ఇచ్చింది. దీని తర్వాత వెంటనే, “సారీ అమీర్.. ఐ లవ్ యూ” అని చెప్పింది.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా అమీర్ ఖాన్ తన రెండో భార్య కిరణ్ రావ్ నుంచి 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. నిజానికి దీని ముందు నుంచే మరో హీరోయిన్ తో అమీర్ ఖాన్ సన్నిహితంగా ఉంటున్నారని బాలీవుడ్ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. అమీర్ ఖాన్ నుంచి 2016లో వచ్చిన దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ కు కూతురి పాత్రలో కనిపించిన ఫాతిమా సనాషేక్ తో అమీర్ డేటింగ్ చేస్తున్నాడంటూ ఇప్పటికే చాలా సార్లు వార్తలు వచ్చాయి. దీని వల్లే అమీర్, కిరణ్ రావ్ విడిపోయారని, డైవర్స్ తర్వాత ఫాతిమా, అమీర్ సంబంధాలు ఇంకా బలపడ్డాయని టాక్. అయితే ప్రస్తుతం ఫాతిమా సనాషేక్, అమీర్ ఖాన్ పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియా కోడైకూస్తుంది. ఈ నేపథ్యంలో రాఖీ సావంత్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు