Rakul Preet Singh: కుర్రకారును కిర్రెక్కిస్తుంది

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కన్నడ సినీ పరిశ్రమ నుంచి హీరోయిన్ గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత టాలీవుడ్ లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ లో దూసుకుపోయింది. అయితే సినిమాల ఎంపికలో చేసిన తప్పుల వల్ల ఈమె ఆఫర్లను కోల్పోయింది.

రకుల్ ప్రీత్ సింగ్ కి ప్రస్తుతం తెలుగులో అవకాశాలు దూరమయ్యాయని చెప్పవచ్చు. బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తున్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. ఒకానొక సమయంలో మహేష్ బాబు సినిమాకు సైతం డేట్లు లేవని చెప్పిన రకుల్. ప్రస్తుతం తెలుగులో ఒక ప్రాజెక్ట్ కూడా చెయ్యట్లేదు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా చేసిన కొండపోలం సినిమాలో చివరగా కనిపించింది రకుల్.

ఎన్టీఆర్ , మహేష్ బాబు , రామ్ చరణ్ వంటి హీరోల సరసన జత కట్టి మంచి సినిమాలు చేసిన రకుల్ కి ప్రస్తుతం ఒకటి కూడా పెద్ద ప్రాజెక్ట్ లేదు. బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని ప్రయత్నాలు చేసిన అవి సఫలం కాలేదు. ప్రస్తుతం ఈ భామ బికినీ ఫొటోస్ తో కుర్రకారును హీట్ ఎక్కిస్తుంది. బీచ్ దగ్గర ఫోజులు ఇస్తూ ఈ భామ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు