Godfather : ఫైనల్ కలెక్షన్స్ ఎంతంటే ?

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ “గాడ్ ఫాదర్”. మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. రీసెంట్ గా విడుదలైన గాడ్ ఫాదర్ మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సర్వదామన్ బెనర్జీ, గెటప్ శ్రీను, సునీల్ తదితరులు కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా కలెక్షన్ల గురించి సోషల్ మీడియాలో చాలా పుకార్లు వినిపించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా గాడ్ ఫాదర్ మూవీ కలెక్షన్ల పై రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రామ్ చరణ్ మాట్లాడుతూ.. ” మోహన్ లాల్ లూసిఫర్ ఆధారంగా గాడ్ ఫాదర్ ని రీమేక్ చేసాం. ఓటీటిలో ఈ మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ. 145 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ రీమేక్ చిత్రాన్ని చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవచ్చు. బహుశా స్టార్ చరిష్మా స్టార్ పవర్ కూడా రీమేక్ సినిమాల కోసం ప్రేక్షకులను థియేటర్లకు మళ్ళీ రప్పించవచ్చు” అన్నారు.

అలాగే “కానీ ఆ ఫార్ములా ఎప్పుడూ వర్కౌట్ అవుతుందా అంటే నేను మాత్రం కాదు అంటాను. నేను రీమేక్ లు చేస్తూనా అంటే అది నాకు తెలియదు. ఒకవేళ ఏదైనా సినిమాని రీమేక్ చేయాలనుకుంటే ఆ ఒరిజినల్ సినిమా నిర్మాతని ఓటీటీలో విడుదల చేయవద్దని కోరతాను. అలా అయితేనే రీమేక్ చేస్తానని కండిషన్ పెడతాను” అన్నారు రామ్ చరణ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు