Ram Charan : వర్కౌట్స్ మామూలుగా లేవుగా..

“ఆర్ఆర్ఆర్” సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘RC15’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే చిత్రం షూటింగ్ కోసం రామ్ చరణ్, కియారా అద్వానీ విదేశాలకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఓ సాంగ్ ని రూ.15కోట్లతో  షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ సమయంలో దొరికిన గ్యాప్ లో రామ్ చరణ్ వర్కౌట్ల చేసుకుంటూ గడుపుతున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను రామ్ చరణ్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. 

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో రామ్ చరణ్ తన టీమ్ తో కలిసి చేసిన అల్లరి, వర్కౌట్లు మామూలుగా లేవు. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పుణే, రాజమండ్రి, అమృతసర్, వైజాగ్ లలో జరుపుకున్నారు. వాటికి సంబంధించిన పలు ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. శంకర్ – రామ్ చరణ్ కాంబోలో వచ్చే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

ఈ చిత్రానికి “విశ్వంభర” అనే టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్ లో రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్నట్టు సమాచారం. కేవలం కాన్సెప్ట్ పోస్టర్ కోసమే రూ.2కోట్లకు పైగా ఖర్చు చేయడం విశేషం. ఇంత భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో  వేచి చూడాలి మరి. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు