Ram Pothineni: పక్కా బోయపాటి మార్క్

బోయపాటి శ్రీను… మాస్ కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్, హీరోలకి భీభత్సమైన ఎలివేషన్ ఇవ్వాలన్న, ఒక ఫైట్ సీన్ ను అరాచకంగా చూపించాలన్న అది శీను కె చెల్లింది. భద్ర సినిమాతో దర్శకుడిగా తన కెరియర్ మొదలుపెట్టిన బోయపాటి శ్రీను అతి తక్కువకాలంలోనే తన స్టామినా ఏంటో చూపించి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిపించుకున్నాడు.

బోయపాటి తన కెరియర్ లో ఎన్ని సినిమాలు చేసిన కానీ, బోయపాటి కెరియర్ సింహా, లెజెండ్, అఖండ సినిమాలకు ఉన్న స్థానం వేరు.
ఆడియన్స్ బాలయ్య బాబును ఎలా చూపిస్తే చూస్తారో అని ఫుల్ క్లారిటీ ఉన్న దర్శకుడు బోయపాటి శ్రీను. బాలయ్య వరుస ప్లాప్స్ సతమతమవుతున్న ప్రతిసారి బోయపాటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు.

ప్రస్తుతం బోయపాటి అఖండ సక్సెస్ తరువాత రామ్ పోతినేని తో ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పుడు ఒక క్రేజి అప్డేట్ బయటకు వచ్చింది. బోయపాటి ప్రతి సినిమాలనే ఈ సినిమాలో కూడా ఇంటర్వెల్ పార్ట్ అదిరిపోతుందట. ఈ సినిమాలో రామ్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులకు గొప్ప థ్రిల్ ఇస్తోందని.. ముఖ్యంగా రామ్ క్యారెక్టర్ లోని వేరియేషన్ ఎవరు ఊహించని విధంగా రాసుకున్నారట బోయపాటి. అఖండ హిట్ తరువాత వస్తున్న ఈ సినిమా బోయపాటికి, వారియర్ తో ప్లాప్ మూటగట్టుకున్న రామ్ కు ఈ సినిమా ఎంతవరకు కలిసొస్తుందో వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు