Ramcharan: రామ్ చరణ్ – శంకర్ సినిమా క్రేజి అప్డేట్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ పాన్ ఇండియన్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్లాన్ చేసిన మోస్ట్ అవైటెడ్ ఫిలిం #RC15. ఎంతో ఆసక్తి రేపుతూ వస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ నుంచి మేకర్స్ ఆ మధ్య ఓ సాలిడ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. దీనితో మళ్ళీ శంకర్ తనలోని విజనరీ అండ్ కొత్తదనాన్ని చూపించాడు.

సడెన్ గా చూస్తే రోబో పోస్టర్ లా అనిపించింది కానీ క్లియర్ గా చూస్తే మాత్రం శంకర్ మ్యాజిక్ కనిపిస్తుంది.
ఈ పోస్టర్ లో రామ్ చరణ్ , కియారా సహా శంకర్ కూడా కనిపిస్తున్నారు అంతే కాకుండా మొత్తం అంతా ఒక కాస్ట్యూమ్ లో కనిపిస్తూ మొత్తం క్యాస్ట్ ని కూడా ఇందులో రివీల్ చేశారు.

దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న ఈ 50వ సినిమా ఎంత ప్రిస్టేజియస్ గా, కొత్తగా ఉండనుందో ఈ ఒక్క పోస్టర్ చెబుతుంది. చరణ్ కెరీయర్ లో వస్తున్న 15వ సినిమా ఇది. ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

ఎస్ ఎస్ థమన్, ఈ మధ్యకాలంలో ఈ పేరు ఒక మ్యూజిక్ సెన్సేషన్
సినిమా సినిమాకి కొత్తదనం వెతుక్కుంటూ అదిరిపోయే ట్యూన్స్ అందించడం థమన్ కు మాములు విషయం అయిపోయింది,
ఏ పాటను చేసిన అది ఒక ట్రెండ్ అయిపోతుంది. ప్రస్తుతం శంకర్ సినిమాకి సంగీతం చేస్తున్న ఇప్పుడు ఇంకో సాంగ్ కూడా కంపోస్ చేయడం మొదలుపెట్టేసాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు