Rana : మిహీకా ప్రెగ్నెన్సీపై క్లారిటీ

టాలీవుడ్ భల్లాలదేవ రానా దగ్గుబాటి గురించి తెలియని వారు ఉండరు. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చిన రానా.. లీడర్ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయ్యాడు. రెండో సినిమా దమ్ మారో దమ్ లో నటించి బాలీవుడ్ లో అడుగు పెట్టాడు. అప్పటి నుంచి అటు టాలీవుడ్ లో ఇటు బాలీవుడ్ వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు, హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో నెగిటివ్ షెడ్స్ ఉన్న భల్లాలదేవ పాత్ర చేసి మరింత క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.

ఈ భల్లాలదేవ 2020లో తన స్నేహితురాలు మిహీకా బజాజ్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట ఒక్కటై రెండేళ్లు గడుస్తుంది. ఇది ఇలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. దీనికి కారణం.. కొన్ని రోజుల క్రితం రానా తన సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫోటోలో మిహీకా కాస్త బొద్దుగా కనిపించింది. దీంతో మిహీకా ప్రెగ్నెన్సీ అని వార్తలు వచ్చాయి.

దీనికి తోడు.. ఇటీవల మిహీకా కూడా ఒక ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోలో మిహీకా ఒక పాపతో ఉంది. ఈ ఫోటో ప్రెగ్నెన్సీ వార్తలకు మరింత బలం చేకూర్చింది. మిహీకా తన ప్రెగ్రెన్సీ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెప్పింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. చాలా మంది ఈ జంటకు శుభాకాంక్షలు కూడా చెప్పారు. తాజాగా సింగర్ కనికా కపూర్ కూడా రానా, మిహీకాలకు శుభాకాంక్షలు చెప్పింది.

- Advertisement -

దీంతో రానా స్పందించక తప్పలేదు. తాను తండ్రి కాబోతున్నాను అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తన వైఫ్ మిహీకా గర్భవతి కాదని తెల్చి చెప్పారు. ఈ రూమర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తనకు తెలియదని అన్నారు. దీంతో ఇప్పటి వరకు వచ్చిన వార్తలు అన్నింటికీ బ్రేక్ లు పడ్డాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు