Rana Daggubati : భల్లాలదేవ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

రానా అంటే తన పేరు కన్నా తాను చేసిన పాత్రల పేర్లే ఎక్కువ గుర్తుకు వస్తాయి. తన నటనతో అందర్ని మెప్పిస్తూ ఉంటాడు ఈ స్టార్ హీరో. కొత్త కథాంశాలను ఎన్నుకుంటూ ఫాన్స్ ను మెస్మరైజ్ చేస్తుంటాడు ఈ దగ్గుబాటి వారసుడు. తన నటనకు గాను ఎన్నో అవార్డు లను కూడా సొంతం చేసుకున్నాడు.
ప్రధానంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా హిందీ, తమిళ భాషలలో నటుడిగాను, నిర్మాత గాను పనిచేసి సినిమా రంగంలో వివిధ వర్గాలలో తన పనికి ప్రసిద్ది చెందారు. రానాకీ ‘హల్క్ ఆఫ్ టాలీవుడ్’ అనే పేరు కూడా ఉంది. భారతదేశంలోని పాన్-ఇండియన్ అప్పీల్‌ను సాధించిన అతికొద్ది మంది నటులలో రానా ఒకరు. శేఖర్ కమ్ముల దర్శకత్వం లో రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన లీడర్ సినిమాతో తన కెరీర్ నీ ప్రారంభించిన ఈ హీరో తన తొలి చిత్రంతో నే తన నటన ప్రతిభ చాటుకొని అందరి ప్రశంశలు అందుకోవడంతో పాటు ఉత్తమ తొలి మేల్ సౌత్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు.
అతను బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసి అక్కడ వారి అభిమానాలు కూడా పొందారు. ముఖ్యంగా ఈ హీరో రాజమౌళితో చేసిన బాహుబలి సినిమా తనకి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతను తీసుకొచ్చింది. బల్లాల దేవా క్యారెక్టర్లు అదరకొత్తారు మన రానా.  ప్రస్తుతం ఆయన చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో, రానా నాయుడు నెట్‌ఫ్లిక్స్‌లో యాక్షన్ డ్రామా సిరీస్, దీనికి కరణ్ అషుమాన్ మరియు సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించారు. ఆసక్తికరంగా, రానా నాయుడులో విక్టరీ వెంకటేష్ కూడా పవర్ ప్యాక్డ్ రోల్ చేస్తున్నారు.
ఈరోజు ఆయన తన 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. హ్యాపీ బర్త్ డే తో ఇండియన్ హల్క్ అని ఫాన్స్ విషెస్ తెలియజేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు