Kalki2898AD : ఫ్రెండ్ కోసం అన్నీ తానై దగ్గరుండి చేస్తున్నాడు.. చివరికి వేదికపైనా?

Kalki2898AD : టాలీవుడ్ లో ఇప్పుడు అందరి కళ్ళూ కల్కి2898AD మూవీ రిలీజ్ పైనే ఉంది. ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ తో భారీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసాడు. మైథలాజికల్ కాన్సెప్ట్ టచ్ తో వస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ పై ఇప్పటికే తెలుగులో అంచనాలు ఆకాశాన్నంటిపోయాయి. కాని ఇతర భాషల పరంగా ఇప్పుడు కల్కిపై ఉన్న హైప్ సరిపోదు. సినిమా బడ్జెట్ కి, బిజినెస్ కే తగ్గట్టు మరింత క్రేజ్ రావాలి. కానీ రిలీజ్ డేట్ చూస్తే పట్టుమని పది రోజులు కూడా లేదు. ఇలాంటి టైం లో కల్కి రిలీజ్ పై ప్రమోషన్లు ఓ రేంజ్ లో జరగాలి. ఒకేసారి అన్ని చోట్ల తిరుగాడేలా ప్రమోషన్లు ఉండాలి. కానీ కల్కి విషయంలో ఇది జరుగుతుందా లేదా అన్న విషయంపై ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ విశ్లేషకులకు కూడా అనుమానంగా ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా ప్రభాస్ సినిమాలకు సమయానికి అప్‌డేట్స్ ఇవ్వరని.. ప్రభాస్ రేంజికి తగ్గట్లుగా సినిమాకు హైప్ తీసుకొచ్చేలా ప్రమోషనల్ కంటెంట్ ఇవ్వట్లేదని వాళ్లు సోషల్ మీడియాలో నెగెటివ్ ట్రెండ్స్ చేయడం చాలాసార్లు చూశాం. ఇప్పుడు కల్కి కి కూడా ప్రమోషన్లు ఎక్కువ చేయట్లేదని ఫ్యాన్స్ గుర్రుమీదున్నారు.

Rana Daggupati will be the host for Kalki2898AD movie

ఫ్రెండ్ కోసం భల్లాల దేవా..!

ఇక కల్కి2898AD (Kalki2898AD) సినిమా విడుదలకు అటు ఇటుగా వారం రోజులే సమయం ఉంది. కానీ ఈ టైంలో సోషల్ మీడియాలో కల్కి ఫీవర్‌తో ఊగిపోవాల్సి ఉంటుంది. ఇలాంటి టైం లో కల్కి ఫ్రెండ్ భైరవ కోసం భల్లాల దేవుడు మళ్ళీ దిగుతున్నాడు. కల్కి కి సంబంధించి ముంబై లో రానా దగ్గుపాటి అన్నీ దగ్గరుండి ప్రమోషన్స్ కి ప్లాన్ చేస్తున్నాడు. కల్కి అనౌన్స్ అయినప్పటినుండే రానా కూడా తనవంతు సినిమాకి అప్పటి నుండే ప్రమోట్ చేయడం తెలిసిందే. చిత్ర యూనిట్ ని ఏకంగా అమెరికాకి తీసుకెళ్లి రానా ప్రమోట్ చేయించాడు. ఇప్పుడు కల్కి కోసం ఏకంగా హోస్ట్ గా మారనున్నాడట రానా. అవును.. కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రానా దగ్గుపాటి హోస్ట్ గా కూడా మారనున్నాడట. ఇది నిజంగా క్రేజీ న్యూస్ అనే చెప్పాలి. అదీ గాక హిందీలో పలు ఇంటర్వ్యూ లకు కూడా రానా దగ్గరుండి తక్కువ సమయంలో ప్లాన్ చేసాడట.

- Advertisement -

వారంలో ఇండియా మొత్తం కవర్ చేస్తారా?

అయితే 600 కోట్ల సినిమా మరి కొన్ని రోజుల్లో రిలీజవుతున్న ఫీలింగే కనిపించట్లేదని ప్రభాస్ ఫ్యాన్స్ అసహనంగా ఉన్నా, రానా ఎంట్రీ తో ఇప్పుడు ఊపొస్తుందని నెటిజన్లు అంటున్నారు. గతంలో రానా బాహుబలి, RRR సినిమాలకి కూడా ప్రమోట్ చేయడంలో రానా పాత్ర ఎంతో ఉంది. ఇప్పుడు రానా తో కలిసి తెలుగు, హిందీ కి సంబంధించి ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నారట. అలాగే కన్నడ, మలయాళం, తమిళ్ లో హీరో సహా చిత్ర యూనిట్ ప్రమోషన్ చేయనున్నారు. ఒకే రోజు రెండు ఇండస్ట్రీలను కవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనా వారం రోజుల్లో ఇండియా మొత్తం కవర్ చేయాలంటే కష్టం. కానీ కల్కి మేకర్స్ ప్లానింగ్ చూస్తుంటే చేసేలానే ఉన్నారు. ఇక ఈ సినిమాకి ఎంత ప్రమోషన్ అయితే ఎంత భారీగా ఓపెనింగ్స్ కి హెల్ప్ అవుతాయి. మరి కల్కి2898AD సినిమా రిలీజ్ డేట్ కల్లా ఎంతవరకూ అంచనాలు పెంచుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు